Oyo: ఓయో పెద్ద మనస్సు.. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 8 నెలల వేతనంతో పాటు..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సోకి మరణించిన ఓయో ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కోసం బెరీవ్‌మెంట్ ప్లాన్‌ (Bereavement Plan)ను సంస్థ ప్రకటించింది. దీని ద్వారా బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌నుంది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌మ ఉద్యోగుల‌ కుటుంబాలకు ఎనిమిది నెల‌ల మొత్తం జీతాన్ని అందించనుంది.

  • Share this:
క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి ప్రభావం ఆతిథ్య రంగంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఇలాంటి త‌రుణంలో వివిధ సంస్థ‌లు త‌మ‌ ఉద్యోగుల సంక్షేమం గురించి ప‌ట్టించుకోవ‌డం చాలా అరుదు. కానీ ఓయో మాత్రం దానికి భిన్నంగా ఉద్యోగుల క‌ష్ట‌న‌ష్టాల్లో తోడుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. ఉద్యోగుల ఆరోగ్యం ప‌ట్ల దృష్టి సారించ‌డంతో పాటు కోవిడ్ బాధిత కుటుంబాల‌కు ఆర్థికంగానూ తోడ్పాటును అందిస్తోంది. ఇటీవ‌ల ఓయో సంస్థ వారానికి నాలుగు రోజుల ప‌ని దినాల‌ను ప్ర‌క‌టించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దీని త‌ర్వాత తాజాగా ఉద్యోగుల సంక్షేమం కోసం మరో కొత్త నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్‌-19 బారిన పడి మ‌ర‌ణించిన త‌మ ఉద్యోగుల కుటుంబాల‌ను ఆదుకుంటామని సంస్థ ప్రకటించింది. జులై వ‌ర‌కు ఓయో ఉద్యోగులకు జీతంతో కూడిన అప‌రిమిత‌ సెల‌వులను మంజూరు చేస్తున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు, సిఈఓ రితేష్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు.
Tata Motors: మంచి మనస్సు చాటిన టాటా మోటార్స్.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 శాతం వేతనం..
Samsung నుంచి Poco వరకు.. Jio నుంచి Vi వరకు.. కరోనా ఎఫెక్ట్ తో కస్టమర్లకు అందిస్తున్న ఆఫర్లు ఇవే..

కరోనా సోకి చనిపోయిన ఓయో ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కోసం బెరీవ్‌మెంట్ ప్లాన్‌ (Bereavement Plan)ను సంస్థ ప్రకటించింది. దీని ద్వారా బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌నుంది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌మ ఉద్యోగుల‌ కుటుంబాలకు ఎనిమిది నెల‌ల మొత్తం జీతాన్ని అందించనుంది. అలాగే మూడు సంవ‌త్స‌రాల వార్షిక వేత‌నానికి స‌మానంగా ఒక ట‌ర్మ్ ఇన్స్యూరెన్స్‌ను కూడా ప్రకటించింది. అంతేకాక‌, ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు వారి పిల్ల‌ల చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చును కంపెనీ భ‌రించ‌నుంది. చనిపోయిన ఉద్యోగుల జీవితభాగ‌స్వామికి, సంతానానికి గ్రూప్ మెడిక‌ల్ క‌వ‌రేజ్‌ను పొడ‌గిస్తున్నట్లు ప్రకటించింది.

ఓయో వ్య‌వ‌స్థాప‌కులు, సీఈఓ రితేష్ అగ‌ర్వాల్ ఈ నిర్ణ‌యాలపై ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ‘కోవిడ్‌పై పోరాటం ఇంకా ముగియలేదు. ఇలాంటి స్థితిలో మేము ప్రారంభించిన ఈ ప్లాన్.. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో కుటుంబాల‌కు కాస్త ఊర‌ట‌నిస్తుంద‌ని అనుకుంటున్నాం. ప‌రిస్థితులు ఎలా ఉన్నా ఓయోకు చెందిన వారికి, వారి కుటుంబాల‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు మా స‌హ‌కారం ఉంటుంది’ అని తెలిపారు. నాన్-క్రిటిక‌ల్ కోవిడ్ వ్యాధిగ్రస్థుల కోసం ఎల్ 1 హెల్త్‌కేర్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డంతో పాటు ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా ఈ సంస్థ నిర్వ‌హిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published: