Home /News /business /

OVER RS 900 CRORE DEPOSITED IN BANK ACCOUNTS OF 2 BOYS IN BIHAR REPORT GH VB

Viral News: ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలో రూ.960 కోట్లు జమ.. షాక్ అయిన స్థానికులు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Viral News: బ్యాంక్ అకౌంట్‌(Bank Account)లో ఉండే బ్యాలెన్స్‌ను అందరూ చెక్ చేసుకుంటారు. డిపాజిట్ చేసిన నిధుల గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, చాలామంది తరచుగా బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేస్తుంటారు. ఇలా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్న ఇద్దరు బాలురు షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
బ్యాంక్ అకౌంట్‌(Bank Account)లో ఉండే బ్యాలెన్స్‌(Balance)ను అందరూ చెక్ చేసుకుంటారు. డిపాజిట్(Deposit) చేసిన నిధుల గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, చాలామంది తరచుగా బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేస్తుంటారు. ఇలా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్న ఇద్దరు బాలురు షాక్ అయ్యారు. వీరి ఖాతాల్లో ఏకంగా రూ.900 కోట్లకు పైగా డబ్బు జమ అయింది. దీంతో బీహార్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఈ ఊహించని పరిణామంతో ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు బీహార్‌లోని కతిరాహ్ జిల్లా(Kathiraah District) బగావురా పంచాయితీలో నివసిస్తున్నారు. వీరికి ఉత్తర్ బీహార్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. పాఠశాల యూనిఫారంల కోసం రాష్ట్ర ప్రభుత్వం తమ అకౌంట్లలో డిపాజిట్ చేసిన డబ్బు గురించి తెలుసుకోవడానికి వీరిద్దరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కు చెందిన స్థానిక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కు వెళ్లారు.

Zero Balance Account: జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అందిస్తున్న బ్యాంకులివే.. వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను పరిశీలించండి..


అయితే తమ అకౌంట్లో ఉన్న నగదు నిల్వలను చూసి వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇద్దరి అకౌంట్లో రూ. 900 కోట్లకు పైగా మొత్తం డిపాజిట్ అయింది. విశ్వాస్ ఖాతాలో రూ.60 కోట్లు, అసిత్ కుమార్ అకౌంట్‌లో రూ.900 కోట్లు జమ అయింది. ఈ ఘటనతో బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయారు. అమౌంట్ విత్ డ్రా చేసుకోకుండా వారిని నిలువరించారు. అనంతరం సంబంధిత సమాచారాన్ని పై అధికారులకు నివేదించారు. సాంకేతిక తప్పిదాల కారణంగా ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బీహార్‌లో ఇలా పెద్ద మొత్తంలో సొమ్ము డిపాజిట్ కావడం ఇదే మొదటిసారి కాదు.

ఇటీవలే ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే ప్రైవేటు ట్యూటర్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.5.5 లక్షలు జమ అయింది. అయితే ఆ సొమ్మును తిరిగి ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. నోటీసులు అందుకున్నప్పటికీ డబ్బు వాపసు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అతడు మాట్లాడుతూ.. "కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం ఆ డబ్బును నా బ్యాంక్ అకౌంట్లో వేసిందేమో అనుకున్నాను.

Financial Tips: మీ హోం లోన్ తీర్చేశారా..? తర్వాత నెల ఈఎంఐ డబ్బులను ఇలా పొదుపు చేయండి..


అవసరాల కోసం అకౌంట్ నుంచి రూ.1,60,970 ఖర్చు చేశాను. నాకు అవసరమైనప్పుడు ప్రభుత్వం కొంత డబ్బు పంపినందుకు సంతోషంగా ఉంది. ఊరికే ఖాళీగా ఉన్న అకౌంట్లోకి డబ్బు ఎలా వస్తుంది?" అని పోలీసులను ప్రశ్నించాడు. మంగళవారం పోలీసులు రంజిత్ దాస్‌ను అరెస్టు చేసి, బుధవారం జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
Published by:Veera Babu
First published:

Tags: Bihar, Business, Money, Viral

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు