Home /News /business /

OVER 22 CRORE INDIAN SMARTPHONE USERS REGULARLY USE TRUECALLER APP MKS

Truecaller: సరికొత్త రికార్డు -ఇండియాలో యాక్టివ్​ యూజర్లు ఎందరో తెలుసా?

ట్రూకాలర్ యాప్

ట్రూకాలర్ యాప్

భారతీయుల వ్యక్తిగత డేటాను బైట్ల లెక్కల అమ్ముకుంటోందనే ఆరోపపణలు వెల్లువెత్తినా మనవాళ్లు ట్రూకాలర్ యాప్ ను విశ్వసిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో ట్రూకాల్ అందించిన విశేష సేవలకు ఫలితంగా ఏడాదిలోనే 4.5కోట్ల యూజర్లు పెరిగారు. మొత్తంగా ట్రూకాలర్ యాప్ ను 22 కోట్ల మంది వాడుతున్నారు..

ఇంకా చదవండి ...
ప్రఖ్యాత ఐడెంటిఫికేషన్​ యాప్​ ట్రూకాలర్​ డౌన్​లోడ్స్​లో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నెలవారీ యూజర్​ బేస్​ 30 కోట్లను చేరుకుంది. ఇందులో 22 కోట్ల మంది ఒక్క భారతదేశం నుంచే ఉండటం విశేషం. దీంతో ట్రూకాలర్​ యాక్టివ్​ యూజర్లతో ప్రపంచంలోనే భారత్​ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడే ఎక్కువ మంది ట్రూకాలర్​ను ఉపయోగిస్తున్నారు. దీనిపై ట్రూకాలర్​​ ప్రకటన చేస్తూ.. “ఏడాది క్రితం, ప్రపంచవ్యాప్తంగా మా యాప్​ యూజర్​ బేస్​ 25 కోట్లు ఉండేది. అయితే, గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది యూజర్ల సంఖ్యను పెంచుకోగలిగాం. కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు 5 కోట్ల మంది కొత్త వినియోగదారులు ట్రూకాలర్ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. మా యాప్​పై యూజర్లకు ఉన్న నమ్మకానికి సంతోషిస్తున్నాం. మా యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం.’’ అని ప్రకటించింది.

కొవిడ్ విలయంలో ప్రత్యేక సేవలతో
ట్రూకాలర్​ ప్లాట్‌ఫారమ్‌ 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కాల్ ఐడెంటిఫికేషన్, స్పామ్ బ్లాకింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ యాప్​ సంచలనం సృష్టించింది. దీంతో ప్రారంభం నుంచి ఈ యాప్​కు అద్భుతమైన రెస్పాన్స్​ వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ట్రూకాలర్ స్మార్ట్ ఎస్​ఎమ్​ఎస్​, ఇన్‌బాక్స్ క్లీనర్, ఫుల్-స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లను కూడా ప్రారంభించింది. ఇటీవల, కోవిడ్ ఆసుపత్రులు, కరోనా టెస్టింగ్​ సెంటర్స్​, ఎమర్జెన్సీ కేర్​ వంటి అధునాతన ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

Kerala: మంచం దిగలేడు.. కానీ కోట్లు సంపాదిస్తున్నాడు -మెడ నుంచి కాళ్లు పని చేయకున్నా..



ఏడాదిలోనే 5 కోట్ల మేర పెరిగిన యూజర్లు..
30 కోట్ల యూజర్​ బేస్​ చేరుకోవడంపై ట్రూకాలర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాడుతూ ‘‘మేము మొదట్లో ఎటువంటి భారీ అంచనాలు లేకుండా మా యాప్​ను ప్రారంభించాం. అలాంటి యాప్​ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది యూజర్లను చేరుకోవడం సంతోషంగా ఉంది. ట్రూకాలర్‌ను అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌గా మార్చడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. యూజర్లకు కొత్త ఫీచర్లను అందించడానికి, వారి డేటా ప్రైవసీని కాపాడటానికి ఎప్పుడూ ముందుంటాం. మా ప్లాట్‌ఫారమ్‌పై మిలియన్ల కొద్దీ యూజర్లు ఉంచిన నమ్మకానికి సంతోషిస్తున్నాం. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి స్పష్టమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాం. తద్వారా భవిష్యత్తులో మరింత మంది యూజర్లను చేరుకుంటాం.” అని అన్నారు.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపు



డేటా లీకేజీ ఆరోపణలున్నా..
ట్రూకాలర్​లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నప్పటికీ.. దీనిపై పలు అభియోగాలు ఉన్నాయి. ట్రూకాలర్​లో 4.75 కోట్ల మంది భారతీయ యూజర్ల డేటా లీకైందని సైబర్​ సెక్యూరిటీ, ఆన్​లైన్​ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెల్​ గతంలో తెలిపింది. ఈ విమర్శల మధ్యే యూజర్ బేస్​ పెంచుకోవడం విశేషం.
Published by:Madhu Kota
First published:

Tags: Mobile App, Technology, Truecaller

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు