Home /News /business /

OUR INDIAN PRODUCTS IS PURE VEGETARIAN SAYS CADBURY CLARIFIES ON BEEF ISSUE AK GH

Cadbury Issue: మా చాక్లెట్లు ప్యూర్ వెజ్.. బీఫ్ వివాదంపై కంపెనీ వివరణ 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాడ్బరీ చాక్లెట్లలో గొడ్డు మాసం వినియోగిస్తారనే వార్త ట్విట్టర్లో హల్ చల్ చేసింది. చాలా మంది నెటిజన్లు కంపెనీ ఉత్పత్తులను వినియోగించకూడదని, ఆ చాక్లెట్లను నిషేధించాలని పిలుపునిచ్చారు.

డెయిరీ మిల్క్ చాక్లెట్లతో గుర్తింపు దక్కించుకున్న క్యాడ్బరీ సంస్థపై కొంత మంది నెటిజన్లు చేసిన ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. సంస్థ ఉత్పత్తి చేస్తున్న చాక్లెట్లలో గొడ్డు మాంసం (బీఫ్) వినియోగిస్తున్నారనే వార్తలు వివాదానికి కారణమయ్యాయి. ఈ సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి సేకరించిన కొందరు నెటిజన్లు.. వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులతో చాలా మంది నెటిజన్లు క్యాడ్బరీ చాక్లెట్లను నిషేధించాలని పిలుపునిచ్చారు. దీంతో క్యాడ్బరీ చాక్లెట్ల యజమాని మోండలేజ్ ఇంటర్నేషనల్ కంపెనీ దీనిపై వివరణ ఇచ్చింది.

క్యాడ్బరీ సైట్‌లో ఏముంది..
"ప్లీజ్ నోట్.. మా ఉత్పత్తుల్లో కొన్నింటిలో జెలటిన్ ఉంటుంది. మేము ఉపయోగించే జెలటిన్ హలాల్ చేసిన బీఫ్ నుంచి తీసుకున్నాం" అనే సమాచారమున్న స్క్రీన్ షాట్‌ను కొంతమంది ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫలితంగా నెటిజన్లు సంస్థ ఉత్పత్తుల్లో ఉండే జెలటిన్‌ను గోడ్డు మాంసం నుంచి తీసుకుంటే.. వాటిలో బీఫ్ ఉన్నట్లేనని కంపెనీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై క్యాడ్బరీ డెయిరీ మిల్క్ సంస్థ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.

* క్యాడ్బరీ సంస్థ వివరణ..
"హాయ్.. ట్వీట్టర్లో పంచుకున్న స్క్రీన్ షాట్ భారత్‌లో తయారైన మోండలేజ్ ఉత్పత్తులకు సంబంధించింది కాదు. భారత్‌లో తయారు చేసే మా ఉత్పత్తులు 100 శాతం శాకాహారం. ఇందులో ఎలాంటి బీఫ్ లేదు. కవర్‌పై ఆకుపచ్చ బిందువు గుర్తు దీన్ని సూచిస్తుంది" అని చాక్లెట్ తయారీ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా క్యాడ్బరీ గురించి ఇలాంటి వార్తలను షేర్ చేసే ముందు, వినియోగదారులు సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

"ఇలాంటి ప్రతికూల పోస్టులు మా వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మా ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు.. అది నిజమో కాదో తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నాం" అని క్యాడ్బరీ సంస్థ స్పష్టం చేసింది. క్యాడ్బరీ చాక్లెట్లలో గొడ్డు మాసం వినియోగిస్తారనే వార్త ట్విట్టర్లో హల్ చల్ చేసింది. చాలా మంది నెటిజన్లు కంపెనీ ఉత్పత్తులను వినియోగించకూడదని, ఆ చాక్లెట్లను నిషేధించాలని పిలుపునిచ్చారు. ప్రూఫ్ కూడా ఉందని స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Chocolate

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు