మన బీటెక్‌ బాబుల్లో 80 శాతం మంది పనికిరారు...సంచలనం రేపుతున్న సర్వే...

ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు ఉండటం లేదని, ముఖ్యంగా నాణ్యమైన ఫ్యాకల్టీ లేకపోవడంతో పాటు, తక్కువ వేతనాల కారణంగా మంచి ఫ్యాకల్టీ లభించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కడం లేదని నివేదికలో తెలిపింది.

Krishna Adithya | news18-telugu
Updated: March 25, 2019, 5:32 PM IST
మన బీటెక్‌ బాబుల్లో 80 శాతం మంది పనికిరారు...సంచలనం రేపుతున్న సర్వే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Adithya | news18-telugu
Updated: March 25, 2019, 5:32 PM IST
దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నానాటికీ తగ్గిపోతున్నాయని, ముఖ్యంగా బీటెక్ పాసై బయటకు వస్తున్న ఇంజనీర్లలో 80 శాతం మందికి స్కిల్స్ ఉండటం లేదని కొత్త ఉద్యోగాలకు పనికిరారు అని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ నివేదికలో విడుదల చేసింది. సంచలనాత్మక నిజాలతో కూడిన ఈ నివేదికలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు ఉండటం లేదని, ముఖ్యంగా నాణ్యమైన ఫ్యాకల్టీ లేకపోవడంతో పాటు, తక్కువ వేతనాల కారణంగా మంచి ఫ్యాకల్టీ లభించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కడం లేదని నివేదికలో తెలిపింది. ప్రతీ ఏటా యాన్యువల్ ఎంప్లాయబలిటీ సర్వే నిర్వహించే ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ ఈ సంవత్సరం సాఫ్ట్ వేర్ రంగంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగానికి అత్యంత అవసరమైన కోడింగ్ ఎబిలిటీలో విద్యార్థులు వెనుకబడ్డారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోడింగ్ జాబ్స్ లో భారతీయ ఇంజనీర్లు కేవలం 4.6శాతం మాత్రమే అందిపుచ్చుకుంటున్నారని నివేదికలో తెలిపింది. అదే సమయంలో అమెరికన్ ఇంజనీర్లు మాత్రం 18 శాతం మంది కోడింగ్ పర్ఫెక్ట్‌గా రాయడంలో ముందంజలో ఉన్నట్లు తెలిపింది.

ప్రధానంగా భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మారుతున్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తెలిపింది. అదే సమయంలో కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కేవలం 2.5 శాతం మంది భారతీయ ఇంజనీర్లు మాత్రమే ప్రవేశించారని తేల్చింది. ముఖ్యంగా ఈ రంగంలో రాణించాలంటే మాత్రం మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో నైపుణ్యం సాధించాలని, కానీ దేశీయ ఇంజనీర్లు ఈ విషయంలో వెనుకబడ్డారని తెలిపింది. ఫలితంగా భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కోత పడనున్నట్లు సర్వేలో తేలింది.

మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. బీటెక్ పాస్ ఔట్లలో అత్యధిక శాతం మంది కేవలం థియరీ బేస్డ్ గా మాత్రమే బయటకు వస్తున్నారని, కేవలం 36 శాతం మంది మాత్రమే తమ ఇంటర్న్‌షిప్స్‌ను సమర్థవంతంగా వాడుకుంటున్నారని తెలిపింది.

First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...