Bank Locker Charges: బ్యాంకు లాకర్లు ఇక చాలా కాస్ట్‌లీ.. లాకర్ అద్దెలు పెంచిన SBI.. పూర్తి వివరాలివే..

బ్యాంకు లాకర్ల కోసం చిన్నా, మధ్యతరగతి వారంతా పోటీపడుతున్న ప్రస్తుత తరుణంలో సేఫ్టీ లాకర్ల అద్దెలు పెంచుతూ స్టేట్ బ్యాంక్ (State Bank of India)సరికొత్త సవరణలు తెచ్చింది. కాబట్టి లాకర్లు (safety lockers) ఉపయోగించే వినియోగదారులు ఇక జాగ్రత్తగా లెక్కలేసుకోండి.

news18-telugu
Updated: November 3, 2020, 1:40 PM IST
Bank Locker Charges: బ్యాంకు లాకర్లు ఇక చాలా కాస్ట్‌లీ.. లాకర్ అద్దెలు పెంచిన SBI.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకు లాకర్ల కోసం చిన్నా, మధ్యతరగతి వారంతా పోటీపడుతున్న ప్రస్తుత తరుణంలో సేఫ్టీ లాకర్ల అద్దెలు పెంచుతూ స్టేట్ బ్యాంక్ (State Bank of India)సరికొత్త సవరణలు తెచ్చింది. కాబట్టి లాకర్లు (safety lockers) ఉపయోగించే వినియోగదారులు ఇక జాగ్రత్తగా లెక్కలేసుకోండి. అసలు మీ లాకర్ ను ఎన్నిసార్లు తెరుస్తున్నారో కూడా కచ్ఛితమైన లెక్కలు వేసుకుంటే అదనపు భారం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అంతే కాదు అనవసరంగా పదేపదే బ్యాంకు లాకర్ ఓపన్ చేస్తూపోతే వేల రూపాయలు మెయింటెనెన్స్ చార్జీల కింద చెల్లించక తప్పదు.

మార్చి 31 నుంచి..

చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చవక ధరలకే లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్న స్టేట్ బ్యాంక్ మార్చ్ 31 నుంచి సేఫ్టీ లాకర్ అద్దెలను (locker rentals) పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన అద్దెలు లాకర్ సైజును (locker sizes)బట్టి ఉంటాయి. సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో సైజులు ఉంటాయి. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్లు మీరు లాకర్ ను ఉపయోగించే విధానాన్ని బట్టి లాకర్ ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కో బ్యాంకులో ఒక్కో సైజు లాకర్లు అందుబాటులో ఉంటాయి.

లాకర్ సైజుల వారీగా చార్జీలు ఇవే..
చిన్నది
అర్బన్, మెట్రోల్లో: రూ. 2000+GST
గ్రామాలు, చిన్న పట్టణాలు: రూ. 1500+GST

మీడియం
అర్బన్, మెట్రో : రూ. 4000+GST
గ్రామాలు, చిన్న పట్టణాలు: రూ. 3000+GST
లార్జ్
అర్బన్, మెట్రో : రూ. 8000+GST
గ్రామాలు, చిన్న పట్టణాలు: రూ. 6000+GST
ఎక్స్ ట్రా లార్జ్
అర్బన్, మెట్రో : రూ. 12000+GST
గ్రామాలు, చిన్న పట్టణాలు: రూ. 9000+GST
వన్ టైం లాకర్ రిజిస్ట్రేషన్ చార్జీలు..
స్మాల్, మీడియం లాకర్స్: రూ. 500+GST
లార్జ్, ఎక్స్ ట్రా లార్జ్ లాకర్స్: రూ. 1000+GST
లాకర్ విజిట్ చార్జెస్ 12 విజిట్లు ఉచితం ఆపై చార్జీలు రూ. 100+GST (ప్రతి విజిట్ కు)

ఏడాదికోసారి తెరవకపోతే?
ఏడాది కాలంలో ఒక్కసారి కూడా మీరు లాకర్ తెరవకపోతే (opening locker) వాటిని బ్యాంకు స్వయంగా తెరవచ్చు. ఎందుకంటే ఏడాదికి ఒక్కసారైనా కస్టమర్ లాకర్ ను ఆపరేట్ చేయాలనే నిబంధన ఉంది. ఇలా తెరవని పక్షంలో లాకర్ యజమానికి బ్యాంకు నుంచి నోటీసు వస్తుంది. దీనికి సమాధానం ఇవ్వాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ (RBI)నిబంధనల ప్రకారం దీనికి సంబంధించిన సమాచారాన్ని కస్టమర్లకు ముందుగానే తెలియజెప్పాలి. ఇందులో భాగంగా లాకర్ ఎందుకు తెరవలేదని, లాకర్ ను వాపసు ఇచ్చేస్తారా లేక వచ్చి తెరుస్తారా అంటూ కస్టమర్లను బ్యాంకు అడగాల్సి ఉంటుంది.

వస్తువులు పోతే బ్యాంకుకు సంబంధం లేదు..
మనం ఈ లాకర్లలో ఏం దాచుకున్నామో బ్యాంకులకు తెలియదు. కానీ ఈ లాకర్లలో మనం దాచిన వస్తువులు పోతే మాత్రం అందుకు బ్యాంకులకు ఏమాత్రం బాధ్యత ఉండదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి మీరు లాకర్ ఉపయోగించే సమయంలో ఏ వస్తువులు పెట్టారు, లాకర్ ను సరిగ్గా లాక్ చేశారా లేదా వంటివన్నీ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని, గుర్తుంచుకోవాల్సిందే.

బీమా కూడా చేసుకోవచ్చు..
బ్యాంకు లాకరుకు కూడా బీమా పాలసీ (insurance policy) తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? లాకర్ ను మాత్రమే బ్యాంకు అద్దెకిస్తుంది. వీటిని రక్షించేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థ అయిన సీసీ కెమరాలు, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వంటి నియమాలన్నీ బ్యాంకులు తూ.చ. పాటిస్తాయి. కాబట్టి ఇంట్లోకంటే బ్యాంకు సేఫ్టీ డిపాజిట్ లాకర్లోనే (safety deposit locker) మన సొమ్ము భద్రంగా ఉంటుంది. కానీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం లాకర్ లోని వస్తువులు పోతే బ్యాంకుకు సంబంధం లేదు కనుక సేఫ్టీ లాకర్ కు బీమా దీసుకుంటే మరింత ధీమాగా ఉంటుందన్నమాట.

ఇల్లు కంటే బ్యాంకే పదిలం..
ఇంట్లో కంటే బ్యాంకు లాకర్లో అయితే నగలు, డబ్బు, డాక్యుమెంట్లు భద్రంగా ఉంటాయని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్రాంచీలున్న అన్ని ఊళ్లలోనూ సేఫ్టీ లాకర్ సదుపాయాలను బ్యాంకులు కల్పిస్తున్నాయి. చిన్న ఊళ్లు, పట్టణాలు, మహానగరాల్లో స్మాల్, మీడియం లార్జ్ , ఎక్స్ ట్రా లార్జ్ సైజుల్లో లాకర్లు ఉంటాయి. పట్టణాలు, మహానగరాల్లో లాకర్లకు ఏటా డిమాండ్ (demand for locker)విపరీతంగా పెరుగుతోంది. ఇది కూడా బ్యాంకులకు అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: November 3, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading