ట్యాక్స్ పేయర్లు (Taxpayers) ఒకటి లేదా రెండు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ (Insurance Products) కలిగి ఉండటం చాలా కామన్. అయితే వీరిలో చాలామంది ఎంతోకొంత ట్యాక్స్ సేవ్ (Tax Save) చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఏటా జనవరి-మార్చి నెలల్లో ఇన్సూరెన్స్ లు ఎక్కువగా అమ్ముడుపోవడానికి ట్యాక్స్ పేయర్లే కారణమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. కానీ అదే సమయంలో వీరు తమకు తెలియకుండానే పెద్ద తప్పు చేసేస్తుంటారు. అలా పన్ను ఆదా మాట అటుంచితే చివరికి వీరు అనవసరమైన ఎక్స్‌పెన్సివ్ పాలసీలు కొన్నామని పశ్చాత్తాప పడుతుంటారు. ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే పాలసీ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
కవరేజ్ అమౌంట్
మీరు ప్రొటెక్షన్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకుంటే... ఎక్కువ కవరేజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. థంబ్ రూల్ ప్రకారం, మీ యాన్యువల్ ఇన్‌కమ్ కు 10 రెట్ల సమానమైన కవరేజీ అమౌంట్ అందించే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదా మీ ఆస్తుల మొత్తం, మీ నెలవారీ ఖర్చులకు 300 రెట్లు సమానమైన లైఫ్ కవరేజీ అందించే ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మంచిది. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగితే, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కుటుంబానికి ఫైనాన్షియల్ లైఫ్ జాకెట్‌గా పనిచేస్తుంది.
రిటర్న్‌ను చెక్ చేయడం ముఖ్యం
బీమా-ప్లస్-రిటర్న్ పాలసీ విషయంలో రాబడిని చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇన్సూరెన్స్‌ను కాంబైన్ చేసే అనేక యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పాలసీలు మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తాయి తప్ప బీమా రక్షణకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవు. వీటిపై వచ్చే రిటర్న్‌లు అండర్ లైనింగ్ అసెట్ కి లింక్ అవుతాయని పాలసీ కొనుగోలుదారులు గుర్తించడం ముఖ్యం. సాధారణంగా ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీల్లో బోనస్‌లు, గ్యారెంటీ ఎడిషన్స్ మొదలైన వాటిని జోడించిన తర్వాత కూడా ఇంటర్నల్ రిటర్న్ రేట్ 5-6% కంటే మించదు. రాబడి కావాలనుకునే పాలసీ కొనుగోలుదారులు మెచూరిటీ టైంలో ఫిక్స్‌డ్ సమ్(Fixed Sum) హామీ ఇచ్చే బీమా పాలసీలను ఎంచుకోవడం మంచిది. ఇలాంటి పాలసీలు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి.
లంప్-సమ్ లేదా విడతల్లో పేమెంట్
బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు, పాలసీదారు లేదా నామినీకి డబ్బు ఎప్పుడు అందుతుందో ఆ సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్క బీమా కంపెనీ ఒక్కో నిబంధనను కలిగి ఉంటాయి. అందుకే హామీ మొత్తం ఎలా చేతికి అందుతుందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. మెచూరిటీ సమయంలో మీరు బీమా మొత్తాన్ని లంప్-సమ్ పేమెంట్ గా అందుకుంటారా లేదా పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన ఖర్చులకు విడతల వారీగా మనీ అందుకుంటారా అనేది తెలుసుకోవాలి.
సరెండర్ విలువ
పాలసీదారు తన పాలసీని వాలంటరీగా సరెండర్ చేస్తే కొన్ని బీమా కంపెనీలు, పాలసీలు... వారికి కొంత అమౌంట్ పే చేస్తాయి. దీన్నే సరెండర్ వ్యాల్యూ అంటారు. ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సమస్యల వంటి కారణాల వల్ల పాలసీని సరెండర్ చేయడం కామన్. కొన్ని రకాల బీమా పాలసీలు కొంత సరెండర్ వ్యాల్యూని అందజేస్తాయి కానీ అన్ని పాలసీలు అందివ్వవు. పాలసీ, జీవిత బీమా సంస్థలను బట్టి సరెండర్ వ్యాల్యూ మారుతుంటుంది. అందుకే పాలసీ కొనుగోలు చేసేముందు సరెండర్ వ్యాల్యూ గురించి తప్పకుండా అడగండి. బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పైన పేర్కొన్న విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా పన్ను ఆదా గురించి మాత్రమే ఆలోచిస్తే, జీవితాంతం బాధపడక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, Insurance, Taxpayers