Oppo A93s 5G: ఒప్పో A93s 5జీ స్మార్ట్​ఫోన్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలివే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఒప్పో నుంచి ఎ 93 ఎస్ 5 జి ఫోన్​ చైనా మార్కెట్​లోకి విడుదలైంది. అయితే ఈ ఫోన్​ను భారత్​తో సహా గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఒప్పో నుంచి ఎ 93 ఎస్ 5 జి ఫోన్​ చైనా మార్కెట్​లోకి విడుదలైంది. అయితే ఈ ఫోన్​ను భారత్​తో సహా గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఈ బడ్జెట్ 5 జి స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ను అందించారు. ఇది రియల్‌మీ 8 5జి, పోకో ఎం 3ప్రో, రెడ్‌మి నోట్ 10 టి 5 జి మొదలైన ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఒప్పో A93s 5G ధర

OPPO A93s 5G సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. ఈ వేరియంట్ 8GB ర్యామ్​, 256GB స్టోరేజ్​ ఆప్షన్​తో వస్తుంది. దీన్ని చైనా మార్కెట్​లో CNY 1,999 (సుమారు రూ .22,900) వద్ద లాంచ్​ చేశారు. ఇది వైట్ పీచ్ సోడా, సమ్మర్ నైట్ స్టార్ రివర్, ఎర్లీ సమ్మర్ లైట్ సీ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఒప్పో A93s 5G ఫీచర్లు

ఒప్పో A93s 5G స్మార్ట్​ఫోన్​ 6.5- అంగుళాల ఫుల్​ హెచ్​డి ప్లస్​ ఐపిఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంటుంది. ఈ డిస్​ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1500: 1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ వెనుకవైపు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్​ ఉంటుంది. దీనిలో 48 ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. దీనితో పాటు 2MP పోర్ట్రెయిట్ లెన్స్, 2MP మాక్రో కెమెరా వంటివి చేర్చింది. సెల్ఫీల కోసం, దీనిలో ప్రత్యేకంగా 8MP ఫ్రంట్​ ఫేసింగ్​ కెమెరాను అందించింది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో వస్తుంది. 5W mAh బ్యాటరీ గల ఈ ఫోన్​ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ప్యాక్​తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ఓఎస్ 11.1 తో పనిచేస్తుంది.
Published by:Krishna Adithya
First published: