హోమ్ /వార్తలు /బిజినెస్ /

Opinion | చైనా 5జీ నెట్ వర్క్ నిర్మిస్తుంటే, మనం సెల్ టవర్లు ధ్వంసం చేస్తున్నాం

Opinion | చైనా 5జీ నెట్ వర్క్ నిర్మిస్తుంటే, మనం సెల్ టవర్లు ధ్వంసం చేస్తున్నాం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2020 సంవత్సరాన్ని కరోనా డామినేట్ చేసింది. ఎన్నో క్రియాశీలకమైన మార్పులు తీసుకొచ్చింది. టెలికం సర్వీస్ ద్వారా కొన్ని కోట్ల మందికి లైఫ్ లైన్‌గా మారింది. అది ఆన్ లైన్ క్లాసులు కావొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావొచ్చు. ఆన్ లైన్ హెల్త్ కన్సల్టేషన్స్ కావొచ్చు.

ఇంకా చదవండి ...

(కుల్బీర్ కృష్ణన్,  https://www.news18.com/ కోసం రాసిన వ్యాసం )

2020 సంవత్సరాన్ని కరోనా డామినేట్ చేసింది. ఎన్నో క్రియాశీలకమైన మార్పులు తీసుకొచ్చింది. టెలికం సర్వీస్ ద్వారా కొన్ని కోట్ల మందికి లైఫ్ లైన్‌గా మారింది. అది ఆన్ లైన్ క్లాసులు కావొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావొచ్చు. ఆన్ లైన్ హెల్త్ కన్సల్టేషన్స్ కావొచ్చు. ఆన్ లైన్ క్యాష్ లావాదేవీల్లో కూడా భారీగా పెరుగుదల నమోదైంది. ఎంతోమంది స్ట్రాటజిక్ విశ్లేషకుల అంచనా ప్రకారం చైనీస్ కంపెనీస్ చాలా దేశాల్లో 5జీ నెట్ వర్క్‌ విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టాయి. డిజిటల్ వరల్డ్‌ని మరింత విస్తరించేందుకు ప్రయత్నించాయి. బెల్ట్ అండ్ రోడ్ ప్రయత్నం అనేది ఫిజికల్ డామినేషన్ కోసం అయితే, 5జీ నెట్ వర్క్ అనేది వర్చువల్ వరల్డ్ మీద ఆధిపత్యం సాధించడానికి చైనా ఈ పని చేసింది. చైనీస్ కంపెనీలు హువాయ్, ZTE లాంటి సంస్థలు 5జీ నెట్ వర్క్‌ను నిర్మిస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా వ్యక్తులు, సమూహం, దేశాలకు చెందిన డేటాను కూడా యాక్సెస్ చేసి కంట్రోల్ చేయగల సామర్థ్యం ఉంది.

ప్రస్తుతం ఉన్న 4జీ నెట్ వర్క్ ధరల కంటే సుమారు 100 రెట్ల అధిక ధరలు 5జీలో ఉంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్వయం నియంత్రిత కార్ల, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్‌కు బ్యాక్ బోన్‌గా నిలిచే ఎన్నో అప్లికేషన్లకు ఆధారభూతంగా మారుతుంది. అమెరికాతో జరిగే ఈ టెక్నాలజీ, ఆర్థిక సమరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనా లీడర్గా, పిల్లర్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

చైనా ఈ ఏడాది ఆరంభంలోనే 5జీ సర్వీసెస్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5జీ సిగ్నల్స్ అందించేందుకు 7,18,000 స్టేషన్లను (సెల్ టవర్లు) ఏర్పాటు చేసింది. 170 మిలియన్ల డివైజ్‌లకు చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. టెక్నాలజీలో అమెరికాను ఢీకొట్టడానికి 1.4 ట్రిలియన్ల మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసింది. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కెమెరా, సెన్సార్లు, 5జీ నెట్ వర్క్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా జనాలు ఏం చేస్తున్నారనేది కూడా తెలిసిపోతుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం వచ్చే సంవత్సరం మరో 600000 బేస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని డిసెంబర్ 28న ప్రకటించింది.

భారతదేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది అక్టోబర్‌లో 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ ప్రారంభించింది. అమెరికాకు చెందిన క్వాల్కంతో కలసి ఈ పని మొదలు పెట్టింది. సెకన్‌కు 1జీబీ స్పీడ్ వరకు దూసుకెళ్లింది. గూగుల్‌ భాగస్వామ్యంతో కలసి రిలయన్స్ 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఒకవేళ అది విజయవంతం అయితే, చైనా మొబైల్ కంపెనీలు అయిన షావోమీ, వీవో లాంటి కంపెనీలకు షాక్ తప్పదు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. చైనీస్ కంపెనీలకు దీటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బదులిచ్చే అవకాశం వచ్చే ఏడాది (2021)లో కనిపించనుంది.

ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనల సమయంలో పంజాబ్ రాష్ట్రంలో కొందరు రిలయన్స్ సెల్ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. నిరసన తెలుపడం అనేది రైతులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే, వారు రోడ్లు బంద్ చేయడం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే హక్కు లేదు. అసోచాం తెలిపిన వివరాల ప్రకారం రైతుల ఆందోళనల వల్ల రోజుకు రూ.3500 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ధర్నాల కోసం వారు ఖరీదైన ఏర్పాట్లు చేయడం చూస్తే దానికి ఫండింగ్ ఎలా జరుగుతోందనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు, అమెరికా, కెనడాల్లో ఉన్న కొందరు సిక్కుల నుంచి ఫండ్స్ అందుతుందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌లో ఇప్పటి వరకు 1500 టెలికాం టవర్లను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రిలయన్స్ జియో టవర్లను టార్గెట్ చేశారు. ఇలా ధ్వంసం చేయడం వల్ల టెలికాం సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. టెలికాం టవర్లకు పవర్ బ్యాకప్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లను కూడా కొందరు లూటీ చేశారు. ఎక్కువగా సెల్ టవర్లు ధ్వంసమైన ప్రాంతాలను గమనిస్తే ఆ ప్రాంతాలకు చెందిన వారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నారు. అంటే, దీని వెనుక చైనాకు అనుకూలంగా ఉండే శక్తులు ఫండింగ్ చేస్తున్నాయా అనే సందేహాలు కూడా వస్తాయి. రైతుల ఆందోళనలను వారు ఫండింగ్ చేయడం ద్వారా ఎగదోస్తున్నారా అనేది గమనించాలి.

The author is a former Director General of Police and IG (Operations and Intelligence) of Sashastra Seema Bal. Views expressed are personal.

First published:

Tags: Jio 5G, Punjab, Reliance Industries

ఉత్తమ కథలు