OPENING NEW SAVINGS BANK ACCOUNT KNOW WHICH BANK OFFERS BEST INTEREST RATES ON SAVINGS ACCOUNT SS
Savings Account: ఈ 10 బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే ఎక్కువ లాభాలు
Savings Account: ఈ 10 బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే ఎక్కువ లాభాలు
(ప్రతీకాత్మక చిత్రం)
Savings Account | ఇటీవల సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏవో తెలుసుకోండి.
మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? మీ సేవింగ్స్ అకౌంట్‌పై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఇటీవల సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నాయి బ్యాంకులు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 2.70 శాతం వడ్డీ చెల్లిస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75 నుంచి 3 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 3 నుంచి 3.5 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3 నుంచి 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. పెద్ద బ్యాంకులన్నీ తక్కువ వడ్డీ చెల్లిస్తుంటే చిన్న బ్యాంకులు మాత్రం ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో సమానంగా చిన్న బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలోని డిపాజిట్లకు వడ్డీ ఇస్తుండటం విశేషం. సేవింగ్స్ అకౌంట్లకు 7 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్న 10 బ్యాంకుల జాబితా ఇదే.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్- 6% నుంచి 7%
ఆర్బీఎల్ బ్యాంక్- 4.75% నుంచి 6.75%
బంధన్ బ్యాంక్- 4% నుంచి 7.15%
ఇండస్ఇండ్ బ్యాంక్- 4% నుంచి 6%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 4% నుంచి 7%
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 4% నుంచి 6.5%
యెస్ బ్యాంక్- 4% నుంచి 6%
కొటక్ మహీంద్రా బ్యాంక్- 3.5% నుంచి 4%
డీసీబీ బ్యాంక్- 3.25% నుంచి 5.5%
లక్ష్మీ విలాస్ బ్యాంక్- 3.25% నుంచి 5.75%
మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బుల్ని కొంతకాలంపాటు అలాగే ఉంచితే ఈ వడ్డీ పొందొచ్చు. అయితే ఎక్కువ వడ్డీకి ఆశపడకుండా మంచి సర్వీస్, ట్రాక్ రికార్డ్, ఏటీఎం సేవలు, ఇతర ఛార్జీలన్నీ పరిగణలోకి తీసుకొని సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.