దలాల్ స్ట్రీట్ లో మార్కెట్ పతనం ప్రకంపనలు సృష్టిస్తోంది. హోలీ వేడుక తర్వాత ఒకరోజు గ్యాప్ తో గురువారం ప్రారంభమైన మార్కెట్లు ఆరంభంలోనే మదుపరులకు భారీ నష్టాలను మూటగట్టాయి. సెన్సెక్స్ ప్రీ ఓపెనింగ్ లోనే 1000 పాయింట్లు పతనమైంది. ఇక 9.15 నిమిషాలకు మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1609 పాయింట్లు పతనమై 34,099 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 471 పాయింట్లు పతనమై 9987 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 2018 మార్చ్ తర్వాత 10 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి సెన్సెక్స్ 34000 వేల పాయింట్ల దిగువకు పతనమై 17 నెలల దిగువకు పతనమైంది. అటు ఇండెక్స్ లో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన HDFC, HDFC Bank, Reliance Industries, TCS, Infy స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా 25 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. నిఫ్టీ సూచీలోని అన్ని షేర్లు పతనం బాటపట్టాయి. టాటా మోటార్స్ టాప్ లూజర్ గా నిలిచాయి. టాటా మోటార్స్ 11 సంవత్సరాల దిగువకు పతనమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nifty, Sensex, Stock Market