హోమ్ /వార్తలు /బిజినెస్ /

ChatGPT: చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను నిషేధించిన ఇటలీ.. కారణాలు ఏంటంటే?

ChatGPT: చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను నిషేధించిన ఇటలీ.. కారణాలు ఏంటంటే?

చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను నిషేధించిన ఇటలీ

చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను నిషేధించిన ఇటలీ

ChatGPT: చాట్‌జీపీటీ విద్యార్థులకు నష్టం చేకూరుస్తుందనీ, ఉద్యోగాలకు చెక్‌ పెడుతుందనీ, ప్రైవసీ పరంగా సమస్యలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇటలీ ChatGPTని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సహకారంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ OpenAI... చాట్‌జీపీటీని రూపొందించింది. ఇటీవల అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో GPT 4ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ సంచలనం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ఇతర కంపెనీలు తమ ప్రొడక్టుల్లో చాట్‌జీపీటీ ఏఐ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ ఏఐ పవర్డ్‌ బింగ్‌ను లాంచ్‌ చేసింది. ఈ క్రమంలోనే చాట్‌జిపిటి విద్యార్థులకు నష్టం చేకూరుస్తుందని, ఉద్యోగాలకు చెక్‌ పెడుతుందని, ప్రైవసీ పరంగా సమస్యలున్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఇటలీ ChatGPTని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చాట్‌జిపిటి మైనర్‌లకు ప్రమాదం?

చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ అందిస్తున్న ప్రైవసీకి సంబంధించి విచారణను ప్రారంభించినట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. మోడల్ ట్రైనింగ్‌ కోసం పెద్ద మొత్తంలో వ్యక్తిగత డేటా సేకరించడం, స్టోర్‌ చేయడానికి చట్టపరమైన ఆధారం లేకపోవడం కారణంగా అడ్వాన్స్‌డ్‌ చాట్‌బాట్‌ను నిరోధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ ఏజెన్సీ తెలిపింది.

చాట్‌జీపీటీ తన వినియోగదారుల వయస్సును చెక్‌ చేయడంలో విఫలమైందని ఏజెన్సీ ఆరోపించింది. ఈ చాట్‌బాట్‌ 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండాలని అభిప్రాయపడింది. వినియోగదారుల వయస్సును ధృవీకరించడానికి ఎటువంటి ఫిల్టరూ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మైనర్‌లను సరిపడని సమాధానాలను అందించే అవకాశం ఉందని అంది. ఇటాలియన్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను చాట్‌బాట్ ఉపయోగించడాన్ని తాత్కాలికంగా పరిమితం చేసినట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ స్పష్టం చేసింది. గతవారం కొంత మంది యూజర్లు చాట్‌జీపీటీలో ఇతరుల చాట్‌ హిస్టరీ కనిపిస్తోందని తెలిపారు. దీంతో చాట్‌బాట్‌లో డేటా సురక్షితం కాదని ఇటలీ రెగ్యులేటర్లు వ్యాఖ్యానించారు. దీంతో ప్లాట్‌ఫారంను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచాన్ని మారుస్తుందన్న బిల్‌గేట్స్‌:

ఇటీవల Open AI సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ChatGPT హారిబుల్‌ ప్రొడక్ట్‌. చాట్‌జిపిటి ఫ్రీక్వెంట్‌ ఎర్రర్‌ మెసేజెస్‌, సింప్లిస్టిక్‌ డిజైన్‌, కెపాసిటీ ఇష్యూస్‌ తరచూ సమస్యలు తీసుకొస్తాయి.’ అని అన్నాడు. బిల్ గేట్స్ మాత్రం చాట్‌జీపీటీని ప్రశంసించారు. ఇది మన ప్రపంచాన్ని మారుస్తుందని అన్నారు.

ఏఐ చాట్‌బాట్‌లపై ప్రైవసీపై ప్రశ్నలు?

ఓ బెల్జియన్ యువకుడు ఇటీవల ELIZA అనే ​​AI చాట్‌బాట్‌తో చాలా వారాల పాటు మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలతో చాట్‌బాట్‌ ప్రైవసీపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రాబోయే 10, 12 బోర్డ్ పరీక్షలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ChatGPTని ఉపయోగించడాన్ని ఆల్రెడీ నిషేధించింది.

First published:

Tags: Chatgpt

ఉత్తమ కథలు