SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...

SBI Basic Savings Bank Deposit Small Account | 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD)- స్మాల్ అకౌంట్' ఎలా తీసుకోవాలి? ఇందులో వచ్చే లాభాలేంటీ? మినిమమ్ బ్యాలెన్స్‌తో పాటు ఇతర నిబంధనలు ఎలా ఉంటాయి. తెలుసుకోండి.

news18-telugu
Updated: April 21, 2019, 11:22 AM IST
SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...
SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...
news18-telugu
Updated: April 21, 2019, 11:22 AM IST
ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కేవైసీ (Know Your Customer) వివరాలు తప్పనిసరి. కేవైసీ వివరాలు సరిగ్గా లేక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారు. మరి కేవైసీ సరిగ్గా లేనివారి ఇలాంటి పరిస్థితి ఏంటీ? వాళ్లు బ్యాంకింగ్ సేవలకు దూరం కావాల్సిందేనా? కేవైసీ లేకపోయినా పర్లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ తెరవచ్చు. సాధారణంగా నిరుపేదలు, నిరక్షరాస్యులు కేవైసీ గురించి పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారి కోసమే ఎస్‌బీఐ ప్రత్యేకంగా ఓ అకౌంట్ రూపొందించింది. అదే 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD)- స్మాల్ అకౌంట్'. మరి ఈ అకౌంట్ ఎలా తీసుకోవాలి? ఇందులో వచ్చే లాభాలేంటీ? మినిమమ్ బ్యాలెన్స్‌తో పాటు ఇతర నిబంధనలు ఎలా ఉంటాయి. తెలుసుకోండి.

SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD)- స్మాల్ అకౌంట్


చిరుద్యోగులు, కూలీలు, తక్కువ వేతనంతో పనిచేసేవారి కోసం రూపొందించిన అకౌంట్ ఇది.

18 ఏళ్లు దాటినవాళ్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
సింగిల్, జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు.
ఈ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు.


గరిష్టంగా రూ.50,000 మాత్రమే జమ చేసుకోవచ్చు.
ఒకవేళ బ్యాలెన్స్ రూ.50,000 దాటినా, ఒక ఏడాదిలో జమ చేసిన మొత్తం రూ.1 లక్ష దాటినా కేవైసీ పూర్తి చేయాల్సిందే. లేకపోతే ఎలాంటి లావాదేవీలను అనుమతించరు.
రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ఇచ్చే వడ్డీ రేట్లే స్మాల్ అకౌంట్‌కు వర్తిస్తాయి.
ఒక నెలలో విత్‌డ్రా మొత్తం రూ.10,000, ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష దాటకూడదు.
స్మాల్ అకౌంట్ తీసుకున్న వారికి రూపే ఏటీఎం కార్డు ఉచితంగా లభిస్తుంది. మెయింటనెన్స్ ఛార్జీలు ఉండవు.
NEFT/RTGS ఉచితం.
నెలలో నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...