ప్రతిభావంతులకే హెచ్-1బీ వీసాలు... అమెరికా నిర్ణయం

టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటాయి. అమెరికా హెచ్-1బీ వీసాల కోటాలో కేటాయించినవాటికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ. అందుకే 'వెరీ బెస్ట్' అప్లికెంట్లను మాత్రమే ఎంపిక చేయాలని అమెరికా భావిస్తోంది.

news18-telugu
Updated: December 21, 2018, 6:11 PM IST
ప్రతిభావంతులకే హెచ్-1బీ వీసాలు... అమెరికా నిర్ణయం
ప్రతిభావంతులకే హెచ్-1బీ వీసాలు... అమెరికా నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇక హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేయనుంది అమెరికా. హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసినవారిలో ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ ఐటీ కంపెనీలు కోరే టెంపరరీ వర్క్ పర్మిట్స్... స్థానిక ఉద్యోగులకు హాని కలిగించకుండా ఉండాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. హెచ్-1బీ వీసాలకు ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు చేస్తుంటారు. అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పలు కీలక ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసాలను కోరుతుంటాయి. టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటాయి. అమెరికా హెచ్-1బీ వీసాల కోటాలో కేటాయించినవాటికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ. అందుకే 'వెరీ బెస్ట్' అప్లికెంట్లను మాత్రమే ఎంపిక చేయాలని అమెరికా భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Good News: రూ.101 ధరకే వివో స్మార్ట్‌ఫోన్

#FlashBack2018: ఈ ఏడాది రిలీజైన టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఇవేహెచ్-1బీ వీసాకు ఉన్నంత డిమాండ్ మరే ఇతర వీసాలకు ఉండదు. మొత్తం దరఖాస్తుల్లో హెచ్-1బీ వీసాలకే ఎక్కువగా వస్తుంటాయి. పూర్తి అర్హతలు ఉండి బాగా పనిచేసే అమెరికన్ల స్థానంలో హెచ్-1బీ వీసాపై వచ్చేవారిని రీప్లేస్‌ చేయొద్దు. విదేశాల నుంచి తక్కువ వేతనానికే ఉద్యోగులు వస్తున్నారన్న కారణంతో స్థానికులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. యాజమాన్యాలు, రిక్రూటర్స్, ఏజెంట్లు విదేశీ ఉద్యోగుల శ్రమ దోపిడీ చేయకూడదు.
కిర్స్ట్‌జెన్ నీల్సన్, హోమ్‌ల్యాండ్ సెక్రెటరీ


ఇవి కూడా చదవండి:రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు

#FlashBack2018: ఈ ఏడాది టాప్-10 గేమ్స్ ఇవే... మీరెన్ని ఆడారు?

ఓసారి పాత లెక్కలు చూస్తే హెచ్-1బీ వీసాల కోసం మొత్తం 654,360 దరఖాస్తులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్స్ ఆఫీస్ పరిశీలించింది. అందులో 599,782 దరఖాస్తులకు మాత్రమే ఆమోదముద్రపడింది. 8,627 దరఖాస్తులను తిరస్కరించగా, 45,951 అప్లికేషన్స్‌ని కంపెనీలే విత్‌డ్రా చేసుకున్నాయి. ఉద్యోగుల సామర్థ్యాలు, నైపుణ్యాల ఆధారంగా హెచ్-1 బీ వీసాలను జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఈ వీసాలు పొందినవారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే. ఇప్పటివరకు హెచ్-1 బీ వీసాలు పొందిన వారిలో కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్(176,025), కంప్యూటర్ ఆక్యుపేషన్స్ (120,736), సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ (67,262), అకౌంటెంట్స్, ఆడిటర్స్ (54,2410) కంప్యూటర్ ప్రోగ్రామర్స్ (53,727) మంది ఉన్నారు. ఏడాదికి 65,000 హెచ్-1 బీ వీసాలు మాత్రమే ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా ఉన్నత విద్య చదివిన వారికి 20,000 వీసాలు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

Tax Saving Ideas: పన్నులు ఆదా చేసే మార్గాలు ఇవే...

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు
First published: December 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>