RBI | దేశంలో ఇల్లీగల్ లోన్ యాప్స్ (Loan Apps) ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీనియర్‌గా తీసుకుంది. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇల్లీగల్ లోన్ యాప్స్ అంశంపై సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయం తీసున్నారు. కేవలం లీగల్ యాప్స్ (Apps) మాత్రమే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండనున్నాయి. ఇల్లీగల్ యాప్స్ ఇక కనిపించవు.అన్ని లీగల్ లోన్ యాప్స్‌కు సంబంధించి ఒక జాబితా తయారు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు. ఇలా ఆర్‌బీఐ రూపొందించిన జాబితాలోని లోన్ యాప్స్ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో ఉంటాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ మేరకు జాబితాలో ఉన్న యాప్స్ మాత్రమే గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో ఉండేలా చూస్తుంది.
Stock Market రారాజులు వీళ్లే.. ఏ ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారంటే..
ఇల్లీగల్ లోన్ యాప్స్ ద్వారా మనీలాండరింగ్, పన్ను ఎగవేత, డేటా ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే అనుమానాలను నిర్మలా సీతారామన్ కూడా వ్యక్తీకరించారు. ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు ఉపయోగించే 'మ్యూల్ లేదా రెంటెడ్' ఖాతాలను ఆర్‌బిఐ పర్యవేక్షిస్తుంది. అలాగే ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే బ్యాంక్ నాన్ ఫైనాన్స్ సంస్థలు లేదా ఎన్‌బీఎఫ్‌సీలను రద్దు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిర్ణీత కాల వ్యవధిలో పేమెంట్ అగ్రిగ్రేటర్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా ఆర్‌బీఐ చూసుకోనుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోని పేమెంట్ అగ్రిగ్రేటర్లు సర్వీసులు అందించడం వీలు కాదు.
మరో సంచలనానికి టాటా మోటార్స్ రెడీ.. ఈసారి చౌక ధరకే ఎలక్ట్రిక్ కారు!
అలాగే ఆర్థిక శాఖ.. కార్పొరేట్ వ్యవహారాల శాఖను షెల్ కంపెనీలను గుర్తించాలని కోరింది. వీటిని డీరిజిస్టర్ చేయాలని సూచించింది. అలాగే చట్టవిరుద్దమైన రుణ యాప్‌లు అధిక వడ్డీ రేట్లు వసూలు చేయడం, డబ్బు రికవరీ చేయడానికి బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఇతర భాగస్వాములకు లోన్ యాప్స్‌పై సైబర్ అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apps, Bank loan, Bank loans, Loan apps, Nirmala sitharaman