హోమ్ /వార్తలు /బిజినెస్ /

E-Scooters: వామ్మో.. ఎలక్ట్రిక్ స్కూటరా..! కొనడానికి భయపడుతున్న ప్రజలు.. వెలుగులోకి సంచలన నిజాలు..

E-Scooters: వామ్మో.. ఎలక్ట్రిక్ స్కూటరా..! కొనడానికి భయపడుతున్న ప్రజలు.. వెలుగులోకి సంచలన నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

E-Scooters: వచ్చే ఆరు నెలల్లో గృహ వినియోగదారులలో కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ (LocalCircles) కొత్త సర్వే నివేదిక తెలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పెట్రోల్ ధర (Petrol Prices)ల మంట నుంచి ఉపశమనం పొందేందుకు భారత్‌(India)లో చాలామంది ఎలక్ట్రిక్‌ టూ-వీలర్స్ (Electric Two Wheelers) పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. అయితే గత కొన్ని నెలలుగా పదుల కొద్దీ ఈ-స్కూటర్స్‌ (Electric Scooters) అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. ఓవర్‌నైట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాలిపోవడం, ఎండలో పార్క్ చేసినప్పుడు దగ్ధమవ్వడం వంటి ఎన్నో సంఘటనలు కొనుగోలుదారులలో భయాన్ని కలిగించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటే ప్రాణాలకే ప్రమాదమని ఇప్పుడు వీటిని కొనడానికి కొనుగోలుదారులు జంకుతున్నారు.


అయితే దేశంలో ఎంతమంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలనుకుంటున్నారనే విషయంపై చేసిన సర్వేలో ఆశ్చర్యపోయే వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే ఆరు నెలల్లో గృహ వినియోగదారులలో కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ (LocalCircles) కొత్త సర్వే నివేదిక తెలిపింది.


సర్వేలో పాల్గొన్నవారిలో 32 శాతం మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత, పనితీరు పట్ల అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2022, మార్చిలో ఈ సంఖ్య 17 శాతంగా ఉంది. మార్చి, ఏప్రిల్‌లలో 20కి పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ తర్వాత ఓలా, ప్యూర్ ఈవీ, ఒకినావా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులు దాదాపు 7,000 యూనిట్లను రీకాల్ చేశారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES) కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలానే EV తయారీదారులకు నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలను రూపొందించడానికి, లోతైన విచారణ చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సిద్ధమైంది. ఈ మార్గదర్శకాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.


* సర్వేలో సంచలన నిజాలు
వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ఈ-స్కూటర్లపై జనాలకు ఆసక్తి బాగా తగ్గిపోయింది. సర్వేలో మొత్తం 11,000 పార్టిసిపెంట్స్ పాల్గొనగా వారిలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. దాదాపు 5 శాతం మంది తాము కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నా.. తాము నివసించే/పనిచేసే ప్రాంతాలలో ఈ-స్కూటర్‌లకు తగిన సదుపాయాలు లేవన్నారు.


ఇది కూడా చదవండి : హోమ్‌ లోన్‌ సాయంతో రూ.3.5 లక్షల వరకు పన్ను ఆదా.. ట్యాక్స్ భారాన్ని తగ్గించే మార్గాలివే..


అందుకే ఈ-స్కూటర్ కొనుగోలు చేసే ఆలోచన చేయమని తెలిపారు. 7 శాతం మంది ఈ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి తమ వద్ద సరిపడా డబ్బు లేదన్నారు. 31 శాతం మంది వీటిని రైడ్ చేయరు కాబట్టి ఈ-స్కూటర్‌ల పట్ల మక్కువ ఎక్కువగా లేదని సర్వే తెలిపింది. 9 శాతం మంది తమ వద్ద అవసరాలకు కావాల్సిన వాహనాలు ఉన్నాయని తెలిపారు.


ఇటీవల జరిగిన ప్రమాదాల్లో వాహన నష్టంతో పాటు కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనల వల్ల రెండు నెలల పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్షీణించాయని సర్వే పేర్కొంది. ఈ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి అందరిలో ఆసక్తి ఉన్నా.. భద్రత, పనితీరుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ప్రభుత్వానికి, పరిశ్రమకు చాలా కీలకమని నివేదిక పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, E scootor, Electric Vehicle, India

ఉత్తమ కథలు