కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు చాలావరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పైనే ఆధారపడుతున్నారు. సరుకులు కొనడం దగ్గర్నుంచి ఇతరులకు డబ్బులు పంపే వరకు అంతా ఆన్లైన్లోనే. డిజిటల్ వ్యాలెట్ల వినియోగం పెరిగింది. నగరాల్లోనే కాదు, చిన్నచిన్న పట్టణాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. అయితే ఈ లావాదేవీలు ప్రతీసారి సక్సెస్ కావు. ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అకౌంట్లో డబ్బులు కట్ అయినా అవతలివాళ్లకు వెళ్లవు. డిజిటల్ పేమెంట్స్ చేసే ప్రతీ ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు తప్పవు. మరి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? తెలుసుకోండి.
డిజిటల్ పేమెంట్ చేసేప్పుడు డబ్బులు రెండు సార్లు డెబిట్ అయ్యాయా? చాలాసార్లు క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల ఇలా డబ్బులు రెండుసార్లు అకౌంట్ నుంచి కట్ అవుతాయి. అయితే బ్యాంకులు వెంటనే ఒక ట్రాన్సాక్షన్ అమౌంట్‌ను రీఫండ్ చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి రీఫండ్ ఆలస్యం కావచ్చు. అందుకే కస్టమర్లు బ్యాంకు కస్టమర్ కేర్ని సంప్రదించాలి.
మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ చిప్ పనిచేయట్లేదా? చిప్ సరిగ్గా పనిచేయనప్పుడు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా చిప్‌లోనే డేటా రీడ్ కాకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ సాధ్యం కాదు. అలాంటి సమయంలో కార్డ్ స్వైప్ చేసి వాడుకోవచ్చు. కార్డును స్వైప్ చేయడం, ఇన్సర్ట్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. చిప్ పనిచేయనప్పుడు స్వైప్ చేయడం ఉత్తమం. ప్రతీసారి ఇదే సమస్య వస్తే కార్డు మార్చుకోవడం మంచిది.
ఈఎంఐ చెల్లించినప్పుడు అకౌంట్లో డబ్బులు డెబిట్ అవుతాయి కానీ ఈఎంఐ చెల్లించనట్టు చూపించదు. ఇది కూడా ఓ సమస్యే. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బ్యాంకుకు, ఈఎంఐ చెల్లించిన కంపెనీకి కాల్ చేసి ట్రాన్సాక్షన్ వివరాలు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారు.
కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసేలా కార్డుల్ని ఇస్తున్నాయి. అంటే కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కార్డును పేమెంట్ డివైజ్‌కు దగ్గరగా పెడితే చాలు పేమెంట్ పూర్తవుతుంది. ఆ డివైజ్‌లకు ఎన్ఎఫ్సీ ఉంటుంది కాబట్టి సులువుగా పేమెంట్ పూర్తవుతుంది. ఒకవేళ డివైజ్‌కు ఎన్ఎఫ్సీ సపోర్ట్ లేకపోతే మీరు మీ కార్డును స్వైప్ చేసి పేమెంట్ చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...
Aadhaar Services: ఈ 7 ఆధార్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, Credit cards, E-wallet, Personal Finance