Home /News /business /

ONLINE SHOPPING WHAT IS THE TOP ONLINE SHOPPING ITEM DO YOU KNOW THE VALUE OF THE ONLINE MARKET BY 2025 ACCENTURE SURVEY EVK

Online Shopping: టాప్ ఆన్‌లైన్ షాపింగ్ ఐటం ఏంటీ.. 2025 నాటికి ఆన్‌లైన్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping: ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ యుగంలో సోష‌ల్ మీడియాదే అగ్ర‌రాజ్యం, ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్ల‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఆధారంగా యాక్సెంచ‌ర్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ఆధారంగా 2025 నాటికి షాపింగ్ వ్యాల్యు ఎంత పెరుగుతుందో అంచానా వేసింది.

ఇంకా చదవండి ...
    క‌రోనా త‌రువాత ఆన్‌లైన్ షాపింగ్‌ (Online Shopping) క‌ల్చ‌ర్ బాగా పెరిగింది. దాదాపు అన్ని ర‌కాల సోష‌ల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలు ఆన్‌లైన్ షాపింగ్‌కు స‌హ‌క‌రిస్తున్నారు. తాజాగా యాక్సెంచ‌ర్ (Accenture) ఆన్‌లైన్ షాపింగ్‌పై స్ట‌డీ చేసింది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ షాపింగ్ మూడు రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని ఆ సంస్థ స‌ర్వేలో వెల్ల‌డైంది. సోషల్-మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పూర్తిగా జరిగే లావాదేవీలను సోష‌ల్ కామ‌ర్స్ అంటారు. ఈ సోషల్ కామర్స్ 2021 నాటికి $492 బిలియన్ల నుంచి 2025 నాటికి $1.2 ట్రిలియన్లకు చేరుకుంటుందని యాక్సెంచ‌ర్ కన్సల్టింగ్ కంపెనీ నివేదికలో పేర్కొంది. ఈ ట్రెండ్‌ని ప్రధానంగా Gen Z మరియు మిలీనియల్ వినియోగదారుల ద్వారా న‌డుస్తుంద‌ని స‌ర్వే అంచ‌నా వేస్తుంది. వీరు సోష‌ల్ కామ‌ర్స్‌ ఖర్చులో 62% వాటా కలిగి ఉంటారని స‌ర్వే (Survey) సంస్థ అభిప్రాయ ప‌డింది.

    Omicron in India: దేశంలో ఓమిక్రాన్ "సునామీ" వ‌స్తుందా.. గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయి..!


    సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా విక్రయించబడే అత్యంత ఎక్కువ‌ ప్రజాదరణ పొందిన ఉత్పత్తుల్లు దుస్తులు ఉన్నాయి. అనంత‌రం వినియోగదారు ఎలక్ట్రానిక్స్ (Electronics) , గృహాలంకరణ వ‌స్తువులు కొంటున్న‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. ఈ కొనుగోలులో ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పాత్ర ఎక్కువ‌గా ఉన్న‌ట్టు సంస్థ గుర్తించింది.

    Covid 19 Restrictions: ర్యాలీలు చేసుకోవ‌చ్చు.. కానీ స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తారు.. నైట్ క‌ర్ఫ్యూ ఉంటుంది!


    చైనాలోనే ఎక్కువ‌..
    యాక్సెంచ‌ర్ స‌ర్వేలు ప‌లు అంశాలు వెల్ల‌డించింది. 2021లో దాదాపు 3.5 బిలియన్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారని, రోజుకు సగటున రెండున్నర గంటలపాటు దానితో నిమగ్నమై ఉన్నారని యాక్సెంచర్ గుర్తించిన‌ట్టు స‌మాచారం.

    History of the N95 Mask: మ‌న‌ల్ని కాపాడే ఎన్‌-95 మాస్క్‌.. దాని వెనుక ఎంత చ‌రిత్ర ఉందో తెలుసా!


    యాక్సెంచర్ ప్రకారం, సోషల్ మీడియా వినియోగదారులలో 80% మంది సామాజిక-వాణిజ్య కొనుగోళ్లలు చైనా కంటే U.S., U.K.లలోనే త‌క్కువ‌గా ఉన్న‌ట్టు గుర్తించింది. భారతదేశం, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సోష‌ల్ కామ‌ర్స్‌ అత్యధిక వృద్ధిని నమోదు చేసింద‌ని యాక్సెంచర్ పేర్కొంది.

    Enhancing immunity in children: పిల్ల‌ల్ని కాపాడుకోండి.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!


    ఈ స‌ర్వే చైనా, భారతదేశం, బ్రెజిల్, US, UKలోని 10,053 మంది సోషల్-మీడియా వినియోగదారులపై నిర్వ‌హించారు. స‌ర్వే ఆగస్టు 12, 2021 నుంచి సెప్టెంబర్ 3, 2021 మ‌ధ్య ఆన్‌లైన్ ద్వారా స‌ర్వే నిర్వ‌హించారు. ఇది 2021లో ముందుగా ఆ మార్కెట్లలో లోతైన ఇంటర్వ్యూలను కూడా నిర్వహించింది. .
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Online shopping, Survey

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు