Home /News /business /

ONLINE GAMES BAD NEWS FOR ONLINE GAMING LOVERS GST COUNCIL KEY DECISION ON TAX EVK

Online Games: ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రియుల‌కు అల‌ర్ట్‌.. త్వ‌ర‌లో జీఎస్టీఐ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం!

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Online Games | ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్‌లైన్‌ గేమింగ్‌ పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరింది. త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది.

ఇంకా చదవండి ...
    మీరు ఆన్‌లైన్‌ (Online) లో ఎక్కువ‌గా గేమ్స్ ఆడుతున్నారా.. అయితే జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణ‌యం మీకు షాకింగ్‌గానే ఉంటుంది. ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్‌లైన్‌ గేమింగ్‌ (Online Gamming)పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరింది. త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది. ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజు వేచి చూడాల్సి ఉంటుంది.

    Ford: భార‌త్‌లో ఫోర్డ్ సంస్థ​కు భారీ లాస్‌.. ఎన్ని వేల కోట్లు నష్టపోయిందంటే?

    ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్‌ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీ (GST)ని పెంచితే.. గేమింగ్‌ ఇండస్ట్రీ  (Gamming Industry) నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Fixed Deposits: ఫిక్స్‌డిపాజిట్ చేస్తున్నారా.. అయితే ఎక్క‌డ చేస్తే ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుందో తెలుసుకోండి


    ఇండస్ట్రీ షట్‌ డౌన్‌ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే నిపుణులు, మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఒకవేళ జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్‌ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీ (Economy) పై పడుతుందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

    త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త‌..
    ఆన్‌లైన్ గేమ్‌ల‌పై జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. ఈ బృదం మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

    LIC IPO: రికార్డులు తిర‌గ‌రాస్తున్న ఎల్ఐసీ.. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ

    ఈ బృందం సభ్యులకు చైర్మన్‌గా కాన్రాడ్‌ సంగ్మా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై కాన్రాడ్‌ సంగ్మా మాట్లాడుతూ..బుధవారం (మే18)న జరగనున్న సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్‌ గేమింగ్‌ రెవెన్యూ (జీజీఆర్‌)పై పన్ను వేయాలా..లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్‌పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Games, GST, GST Council, Mobile game, Video Games

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు