Home /News /business /

ONLINE FRAUDS FOLLOW THESE SIMPLE STEPS TO PREVENT ONLINE SCAMS GH VB

Online Frauds: ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారా..? ఈ చిట్కాలతో సైబర్ నేరాలకు చెక్ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ బ్యాంకింగ్​లో(Online Banking) ఉన్న రిస్క్‌లను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ స్కామ్‌లను నిరోధించడానికి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
గత కొన్నేళ్లలో డిజిటల్ పేమేంట్లు(Digital Payments) గణనీయంగా పెరిగాయి. బడా వ్యాపార సంస్థల నుంచి.. స్థానిక కిరాణా దుకాణాల వరకు అనేక చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నాయి. దీనితో ఎన్ని లాభాలున్నాయో.. అంతేస్థాయిలో నష్టాలూ ఉంటున్నాయి. పెరిగిన టెక్నాలజీ(Technology) ఆధారంగా సైబర్ మోసాలు(cyber crimes) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్​లో(Online Banking) ఉన్న రిస్క్‌లను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ స్కామ్‌లను నిరోధించడానికి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


యాప్‌లతో జాగ్రత్త..
సాధారణంగా ఆన్​లైన్ లావాదేవీల(Online Transactions) కోసం తప్పనిసరిగా ఏదో ఒక యాప్​ మీద ఆధారపడక తప్పదు. వీటినే ఆన్​లైన్ మోసగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. మీ ఫోన్​లో ఏ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు? అనేది ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అచ్చం మీరు ఇన్​స్టాల్​ చేయాలనుకునే యాప్ ​లాంటిదే మరొకదాన్ని అందుబాటులో ఉంచుతున్నారు కేటుగాళ్లు. అందుకే అధికారిక, విశ్వసనీయ కంపెనీలు రూపొందించిన యాప్​లనే ఇన్​స్టాల్ చేసుకోవాలి.

గూగుల్ ప్లే స్టోర్(Google Playstore), విండోస్ స్టోర్, ఐఫోన్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకింగ్, షాపింగ్ యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని బ్యాంక్‌బజార్.కామ్‌(BankBazaar) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురారి శ్రీధరన్ సూచిస్తున్నారు. తాత్కాలిక యాప్‌ల వినియోగం లేదా వాటి ద్వారా ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే వాటికి బ్యాంక్ ఖాతాల యాక్సెస్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

పబ్లిక్ నెట్‌వర్క్‌లా..? వద్దే వద్దు..
ఈ మధ్య కాలంలో హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్​లు వంటి ప్రదేశాల్లో పబ్లిక్ హాట్‌స్పాట్‌లు, Wi-Fiలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇలా పబ్లిక్ నెట్‌వర్క్‌ల(Public Network) ద్వారా ఏదైనా ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తే, ఆ సమయానికి దానిని ఉపయోగించకుండా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి ఓపెన్ నెట్‌వర్క్‌లు. అందువల్ల వాటిని హ్యాకర్లు సులభంగా ఛేదించగలరు. ఫలితంగా మన బ్యాంక్ ఖాతాలోని కీలక సమాచారాన్ని యాక్సెస్ చేసి డేటాను చోరీ చేస్తారు. వీలైనంత వరకు పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌కి కనెక్ట్ చేసిన సమయాల్లో మాత్రమే ఆర్థిక లావాదేవీలు చేస్తే మేలు.

Flipkart Big Saving Days Sale 2022: ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. తక్కువ ధరకు 5జీ మొబైల్ స్మార్ ఫోన్లు..


 లింక్‌ల పట్ల జర భద్రం..
షాపింగ్ మాల్స్, గ్రాసరీ స్టోర్​లు, మెడికల్ షాపుల్లోనూ బిల్లింగ్ సమయాల్లో ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి వస్తోంది. అయితే అప్పుడప్పుడూ ఆయా సంస్థల పేరిట మెసేజ్​లు, ఈమెయిల్‌ల్స్ వస్తుంటాయి. ప్రైజ్ మనీ గెలిచుకున్నామని, రివార్డ్‌లు వచ్చాయని.. చెబుతూ సైబర్ నేరగాళ్లు(Cyber Crime) లింక్‌లు పంపుతుంటారు. ఈ లింక్‌లు చాలా వరకు నకిలీవి. వీటిని ఫిషింగ్ లింక్​లు అంటారు. వాటిపై క్లిక్ చేశారా ఇక అంతే. మీ మొబైల్ భద్రత ప్రమాదంలో పడినట్లే. అందువల్ల ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉన్నందున ఆన్​లైన్ లావాదేవీల విషయంలో ఆచితూచి నడచుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, Debit cards, Online fraud

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు