Home /News /business /

ONLINE BANK ACCOUNT KNOW REQUIRED DOCCUMENTS AND OPPENING PROCESS EVK

Bank Account : అందుబాటులో ఆన్‌లైన్‌లో బ్యాంక్ ఎకౌంట్‌.. ఎలా చేసుకోవాలంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Bank Account : రోజు రోజుకు బ్యాంకింగ్ (Banking) రంగం కొత్త పుంత‌లు తొక్కుతుంది. క‌రోనా త‌రువాత బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు వ‌చ్చాయి. చాలా విభాగాలు ఆన్‌లైన్ (Online) చేస్తున్నారు. ఇప్పుడు ఎకౌంట్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే పొదవ‌చ్చు.

ఇంకా చదవండి ...
    రోజు రోజుకు బ్యాంకింగ్ (Banking) రంగం కొత్త పుంత‌లు తొక్కుతుంది. క‌రోనా త‌రువాత బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు వ‌చ్చాయి. చాలా విభాగాలు ఆన్‌లైన్ (Online) చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఎకౌంట్ ఓపెనింగ్ (Account Oppening) అంటే అన్ని బ్యాంకుల‌కు వెళ్లాల్సిందే. కొన్ని బ్యాంకుల‌కు మాత్ర‌మే ఉండే డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking) ఎకౌంట్ ఓపెనింగ్ అన్ని బ్యాంకుల‌కు విస్త‌రిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. 22,000 పైగా బ్రాంచ్‌లతో 45 కోట్లకు పైగా కస్టమర్లకు సేవల్ని అందిస్తోంది . అటువంటి బ్యాంక్ కూడా ఆన్‌లైన్‌లోనే కేవైసీ (KYC) ప్రాసెస్‌ను ప్ర‌వేశ పెట్టి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకొనే వెసులుబాటు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సేవింగ్స్‌ ఖాతాలు (Savings Accounts) తెరిచేందుకు బ్యాంకులకు నేరుగా రావాల్సిన అవసరమే లేదు. వీడియో కేవైసీ సౌకర్యం ఉపయోగించుకుంటే చాలు.. వీడియో ఆధారంగానే గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

    ఏమిటీ వీడియో కేవైసీ విధానం.. ఎలా ఉంటుంది.
    క‌రోనా కార‌ణంగా చాలా మంది బ్యాంకుల‌కు వెళ్ల‌కుండానే అన్ని ప‌నులు కావాల‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం వీడియో కేవైసీ సౌకర్యం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.

    Smart Phone Tips: స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..


    ఈ విధానంలో కేవ‌లం వీడియో ద్వారా వెరిఫికేషన్‌ అయిపోతుంది. దీని ద్వారా మ‌నం అందించిన చిరునామా చెక్‌బుక్‌, ఏటీఎం కార్డు నేరుగా నమోదు చేసుకున్న చిరునామాకు వచ్చేస్తాయి.

    ఏం అవ‌స‌రం ..
    ఆన్‌లైన్‌లో వీడియో కేవైసీ చేసుకోవాలంటే ఏం అవ‌స‌ర‌మో తెలుసుకుందాం. మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు (మొబైల్‌, ఈమెయిల్‌ లింక్‌ అవ్వాలి) క‌చ్చితంగా అవ‌స‌రం. వీడియో అవసరం కాబట్టి మీ ల్యాప్‌ట్యాప్‌ లేదా కంప్యూటర్‌ లేదా మొబైల్‌కు కెమెరా, మైక్రోఫోన్‌, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండాలి. ఆధార్‌, పాన్ సమాచారం సిద్ధంగా, త‌ప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ ప్ర‌క్రియ‌లో త‌ర‌చూ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది స‌రిగా అందించాలి.

    ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కసారి అది కూడా కేవైసీ వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్తే చాలు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. మీ అకౌంట్‌ను జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. ప్రతీ నెలా స్టేట్‌మెంట్స్ ఇ-మెయిల్ ద్వారా స్టేట్‌మెంట్స్ లభిస్తాయి. పర్సనలైజ్డ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: BANK ACCOUNTS, Online service

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు