Onion Price: ఆకాశమార్గం పట్టిన ఉల్లిధరలు...సామాన్యులకు అందనంత ఎత్తులో...

కిలో ఉల్లిగడ్డ హోల్ సేల్ మార్కెట్లో రూ.30లు పలుకుతోంది. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఉల్లిపాయ ధర కిలో రూ.40 పైచిలుకే పలుకుతున్నాయి. ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

news18-telugu
Updated: August 25, 2019, 9:02 PM IST
Onion Price: ఆకాశమార్గం పట్టిన ఉల్లిధరలు...సామాన్యులకు అందనంత ఎత్తులో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి ధరలు సామాన్యుడిని సతమతం చేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో వరదలు ముంచెత్తడంతో ఉల్లి సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కిలో ఉల్లిగడ్డ హోల్ సేల్ మార్కెట్లో రూ.30లు పలుకుతోంది. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఉల్లిపాయ ధర కిలో రూ.40 పైచిలుకే పలుకుతున్నాయి. ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూనే నుంచి రావాల్సిన ఉల్లి లోడ్ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వరదలతో కర్ణాటక, మహారాష్ట్రల్లో రోడ్లు నష్టపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు చేరాల్సిన ఉల్లిపాయలు వ్యవసాయ క్షేత్రాల వద్దనే నిలిచిపోతున్నాయి.

ఇదిలా ఉంటే ఉల్లి ధరలు మండిపోతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. వంటల్లో ఉల్లి లేకుండా చాలా మంది ఇష్టపడని విషయం తెలిసిందే. అయితే ఇదే అదనుగా భావిస్తున్న కొందరు బ్లాక్ మార్కెటీర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆందోళను మిన్నంటాయి.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు