హోమ్ /వార్తలు /బిజినెస్ /

Success Story: ఒక చిన్న ఐడియా ఈ కుర్రాడిని కోటీశ్వరుడ్ని చేసింది..! సక్సెస్ అంటే ఇదే మరి..!

Success Story: ఒక చిన్న ఐడియా ఈ కుర్రాడిని కోటీశ్వరుడ్ని చేసింది..! సక్సెస్ అంటే ఇదే మరి..!

మోనిష్ (ఫైల్)

మోనిష్ (ఫైల్)

'మేక్ ఇన్ ఇండియా' (Make in India) అనే నినాదం ఎన్నో స్టార్ట్ అప్ కంపెనీలకు (Start up Companies) నాంది పలికింది. కరోనా కాలంలో కొత్త స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తున్నాయి. అనూహ్య రీతిలో సమస్యలు ఎదురైనా వెన్నకు చూడకుండా విజయాన్ని స్వంతం చేసుకున్నాడు ఒంగోలు కుర్రాడు.

ఇంకా చదవండి ...

  M.Bala Krishna, Hyderabad, News18

  'మేక్ ఇన్ ఇండియా' (Make in India) అనే నినాదం ఎన్నో స్టార్ట్ అప్ కంపెనీలకు (Start up Companies) నాంది పలికింది. కరోనా కాలంలో కొత్త స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తున్నాయి. అనూహ్య రీతిలో సమస్యలు ఎదురైనా వెన్నకు చూడకుండా విజయాన్ని స్వంతం చేసుకున్నాడు ఒంగోలు కుర్రాడు. ఆన్లైన్ ఈ కామర్స్ (e-Commerce) రంగంలో అడుగు పెట్టి తనదైన మార్క్ తో ముందుకెళ్తున్నాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా మారుతోంది. ఒకవేళ ఉద్యోగం వచ్చిన సరైన వేతనాలు దొరకడం లేదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికీ ఆదర్శంగా అవుతూ... పది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు మోనిష్ పత్తిపాటి. నోయిడాలో మోనిష్ తన ఇంజనీరింగ్ ను పూర్తి చేసాడు. చదుకొనే రోజుల్లోనే ద్విచక్ర వాహనాలకు సంబంధించిన విడిభాగాలను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు స్టార్ట్ అప్ సంస్థను మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు.

  ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో అవరోధాలు ఎదురైనా సంస్థ స్థాపనకు ముందగుడు వేశాడు. నాలుగేళ్లు శ్రమించి ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టాడు. బ్రాండింగ్ తో కూడిన జాతీయ, ఆంతర్జాతీయ వస్తువులకు ఉన్న డిమాండే వేరు. ఆ డిమాండ్ ద్వారా స్థానిక వస్తువులకు ఆదరణ పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. స్థానిక వస్తువులకు డిమాండ్ పెంచేందుకు తనదైన శైలిలో కృషి చేసారు. ప్రాంతీయత కలిగిన వస్తువులను విక్రయించేందుకు 'pick n hook' పేరుతో స్టార్ట్ అప్ ను స్థాపించాడు

  ఇది చదవండి: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?


  ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఈబే కంపెనీలతో పోటీ పడేందుకు వాటితో సమానమైన ప్రమాణాలతో ఈ కామర్స్ వెబ్ సైట్ ను నడుపుతున్నాడు మోనిష్. ఈ వెబ్ సైట్ లో దాదాపు 2 వేల స్థానిక ఉత్పత్తులకు అవకాశం కల్పించడంతో పాటు.., ఒక్కరోజునే డెలివరీ అయ్యేలా ప్రణాళికలు రూపొందించాడు. 'pick n hook' కంపెనీ ద్వారా దాదాపు 70 మందికి ఉద్యోగాలు కల్పించాడు. తన ఈ కామర్స్ బిసినెస్ కు ఆదిలోనే ఎన్నో అవరోధాలు ఎదురైయ్యాయి. ప్రాజెక్ట్ మొదలెట్టిన కంపెనీ మా వల్ల కాదు అని చేతులు ఎత్తేయగా.., మరో కంపెనీ మధ్యలో ప్రాజెక్ట్ ను విడిచిపెట్టేసింది.

  ఇది చదవండి: కేవలం రూ. 9వేల పెట్టుబడి.. రాబడి రూ.కోటి.. అదేంటో ఓ లుక్కేయండి..


  దీంతో స్వతహాగా ఇంజనీర్ అయినా మోనిష్ ప్రాజెక్ట్ డిసైనింగ్ తానే మొదలెట్టారు. ప్రాజెక్ట్ రూపు దిద్దుకున్నాక తన ఆలోచనను మిత్రులతో., బంధువులతో పంచుకున్నాడు. వారి ద్వారా స్థానికంగా ఉత్పత్తి అయ్యే తయారీ ప్రరిశ్రమల వివరాలు సేకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉప్త్పత్తులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాడు. మోడ్రెన్ దుస్తులు, చేతి గడియారాలు., కళ్లజోడులు వంటి వాటితో పాటు స్థానిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. నాలుగేళ్లలోనే పూర్తి స్థాయి ఈ కామర్స్ సంస్థగా తీర్చి దిద్దాడు మోనిష్.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Business Ideas, Start-Up

  ఉత్తమ కథలు