హోమ్ /వార్తలు /బిజినెస్ /

One Station One Product: రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు స్టాల్స్.. కాచిగూడ, సికింద్రాబాద్, విజయవాడలో ఏర్పాటు.. వివరాలివే

One Station One Product: రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు స్టాల్స్.. కాచిగూడ, సికింద్రాబాద్, విజయవాడలో ఏర్పాటు.. వివరాలివే

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

ఇండియన్ రైల్వే (Indian Railways) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానికంగా తయారు చేసే వస్తువులను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా One Station One Product కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇండియన్ రైల్వే (Indian Railway) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానికంగా తయారు చేసే వస్తువులను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా One Station One Product కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రైల్వే స్టేషన్లలో (Railway Stations) స్థానికంగా తయారు చేసిన వస్తువులను విక్రయించనున్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, సప్లయి చెయిన్లకు సాయం చేయడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సమయంలో ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’విధానాన్ని ప్రకటించారు. రైల్వే నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటూ.. స్థానిక ఉత్పత్తుల సప్లయి చెయిన్లను మరింత మెరుగుపరచనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad Railway Station) హైదరాబాద్ పెరల్స్ & బ్యాంగిల్స్ స్టోర్ ను ఏర్పాటు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో పోచంపల్లి చేనేత తయారీ దుస్తుల స్టోర్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కొండపల్లి బొమ్మలు మరియు హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన స్టోర్ ను ఏర్పాటు చేశారు. 'Paithani Sarees and Himroo Shawls’ కు సంబంధించిన స్టోర్ ను ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు.

Vizag News: రైల్వే స్టేషన్లోనూ షాపింగ్.. లోకల్ బ్రాండ్స్ కు కేంద్రం ప్రమోషన్..

దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ను ప్రారంభిస్తారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సహకార సంస్థలు, రైతులు, ఉత్పత్తి దారులు స్టాల్స్ లో తమ ఉత్పత్తులను విక్రయానికి ఉంచుతారు. ప్రయాణికులు, వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి 15 రోజుల వరకు స్టాల్స్ ను కొనసాగిస్తారు.

First published:

Tags: Indian Railways, Nirmala sitharaman, South Central Railways

ఉత్తమ కథలు