Home /News /business /

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై ఇంట్రస్ట్ ఉందా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై ఇంట్రస్ట్ ఉందా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై ఇంట్రస్ట్ ఉందా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై ఇంట్రస్ట్ ఉందా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Mutual Funds: బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలు ఎప్పటికీ మారవు. అందుకే పెట్టుబడులు ప్రారంభించే ముందే అసలు మీ అవసరాలేంటో గుర్తించాలి. దానికి తగినట్లుగా స్వల్ప కాలం, దీర్ఘ కాల పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘ కాలానికి ఇలా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  కాలేజీ అయిపోయింది. ఉద్యోగం వచ్చింది.. ఇప్పుడే కెరీర్‌లో సెటిల్ అవుతున్నారు అంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎన్నో రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే మిలీనియల్స్ ఎలాంటి ఆర్థిక సలహాలు పాటించాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు భయపడాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో హెడ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎ. బాలసుబ్రమణ్యన్ వారికి సలహాలు అందిస్తున్నారు. ఆయనకు మార్కెట్లో 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్ మెంట్స్ చేసే వారి కోసం ఆయన అందిస్తున్న చిట్కాలు..

  బేసిక్స్ మర్చిపోవద్దు..
  డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ మెంట్స్ జరిగే పద్ధతి పూర్తిగా మారిపోయింది. అన్ని వివరాలను తెలుసుకోవడం నుంచి ఇన్వెస్ట్ మెంట్ వరకు అంతా ఆన్ లైన్ అయిపోయింది. మిలీనియల్స్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు కొత్త కొత్త మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఫిన్ టెక్ సంస్థలు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటిలో గ్రో, పేటీఎం వంటివి ఫేమస్.. ఇలాంటి సంస్థలు పెట్టుబడులను మన చేతిలో పనిగా మార్చేశాయి. అయితే ఇవి ఎన్ని ఉన్నా కొన్ని బేసిక్స్ మాత్రం పాటించాలని వివరిస్తున్నారు బాలసుబ్రమణ్యన్.

  బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలు ఎప్పటికీ మారవు. అందుకే పెట్టుబడులు ప్రారంభించే ముందే అసలు మీ అవసరాలేంటో గుర్తించాలి. దానికి తగినట్లుగా స్వల్ప కాలం, దీర్ఘ కాల పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘ కాలానికి ఇలా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు.

  ట్రెండ్స్ చెక్ చేస్తూ.. నప్పేదే చేయండి...
  చాలా మంది మార్కెట్ ట్రెండ్స్ పై ఓ కన్నేసి ఉంచుతారు. కానీ ఏ ట్రెండ్ ఎక్కువ కాలం నిలవదు. అందుకే ట్రెండ్ తో పాటు వెళ్తూ విలువ పెరుగుతోందని కొని ఆ తర్వాత అమ్మడం వంటివి సరికాదు.. ఏదైనా స్టాక్స్ కొంటే దీర్ఘ కాలిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. కరోనా తర్వాత కొన్ని రంగాలు తిరిగి పుంజుకుంటే మరికొన్ని రంగాలు మాత్రం చతికిలబడ్డాయని చెప్పుకోవాలి. మార్కెట్లో కొన్ని ప్రయోగాలు చేయడం, కొత్త కొత్త ట్రెండ్స్ ప్రయత్నించడం అవసరం. కానీ మరీ ఎక్కువగా దానిపైనే డిపెండ్ అవ్వడం కూడా సరికాదు. అందుకే మీకంటూ చక్కటి ఇన్వెస్ట్ మెంట్ బేస్ ఏర్పడిన తర్వాతే మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది.

  Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

  KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

  Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

  Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

  రియలిస్టిక్‌గా ఉండండి...ుు
  ఎలాగో పెట్టుబడులు పెడుతున్నాం కదా.. రెండేళ్లలో కోటి రూపాయలు సంపాదించేస్తానని భావించడం.. దాని కోసం ఇష్టం వచ్చినట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభం పక్కన పెడితే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా మనం ఆశించే లాభం కాస్త రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోవాలి. స్టాక్స్ కొనేటప్పుడు వాటి బేసిక్ ట్రేడింగ్ వ్యాల్యూకి కేవలం 25 శాతం మాత్రమే తక్కువకు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌ను నెట్ అసెట్ వ్యాల్యూ కంటే 10 రెట్లు ఎక్కువకు అమ్మడం సరైనది. కానీ అవసరం ఉంటే 7 రెట్లు ఎక్కువకు కూడా అమ్మవచ్చు. ఏ కంపెనీ తమ బుక్ వ్యాల్యూ కంటే ఎక్కువకు ట్రేడ్ అవ్వదు. దీన్ని గుర్తించి కంపెనీ విలువ మరీ తక్కువగా ఉంటే దాన్ని కొనకుండా.. కాస్త పడినప్పుడు కొనుగోలు చేయడం సరైనది. అలాగే అమ్మే సమయంలో మంచి లాభాలను బుక్ చేసుకొని అమ్మడం సరైనది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Mutual Funds

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు