హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life insurance: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? అయితే ఈ రైడర్లు తీసుకోవడం మర్చిపోవద్దు..

Life insurance: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? అయితే ఈ రైడర్లు తీసుకోవడం మర్చిపోవద్దు..

అధిక రాబడులు, బోనస్, లోన్, బంగారు నాణేలు వంటి ఆఫర్‌లకు లొంగిపోకండి. సందేహం ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి తనిఖీ చేయండి. విశ్వసనీయ సమాచారం నుండి లేదా ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఇన్సూరెన్స్ సంస్థ నుండి ధృవీకరణ కాల్‌ను జాగ్రత్తగా వినడం ద్వారా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వండి.

అధిక రాబడులు, బోనస్, లోన్, బంగారు నాణేలు వంటి ఆఫర్‌లకు లొంగిపోకండి. సందేహం ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి తనిఖీ చేయండి. విశ్వసనీయ సమాచారం నుండి లేదా ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఇన్సూరెన్స్ సంస్థ నుండి ధృవీకరణ కాల్‌ను జాగ్రత్తగా వినడం ద్వారా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వండి.

చాలా కొన్ని రకాల కంపెనీలు మాత్రమే బేసిక్ ప్లాన్లలో రైడర్లను చేరుస్తున్నాయి. మిగిలిన కంపెనీలు బేసిక్ ప్లాన్లు ఏర్పాటు చేసి వారి అవసరాలకు అనుగుణంగా రైడర్లు కొనుగోలు చేసే వీలును కల్పిస్తున్నాయి.

  మన జీవితం సజావుగా సాగిపోవాలంటే ఆర్థికంగా మనం చక్కటి స్థితిలో ఉండాలి. అయితే ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో తెలీదు కాబట్టి ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకొని ఉండడం మంచిది. అయితే సాధారణంగా తీసుకునే బీమాకి అన్ని రకాల సదుపాయాలు ఉండకపోవచ్చు. అందుకే దీనికి కొన్ని రకాల రైడర్లను చేర్చుకోవడం మంచి పద్ధతి. దీనివల్ల మీ ఇన్స్యూరెన్స్ కవరేజీ చాలా రకాల కేటగిరీలకు అప్లై అయ్యేలా చేసుకోవచ్చు. మీ లైఫ్ పాలసీని కస్టమైజ్ చేసేందుకు ఈ రైడర్లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఇలాంటివి ఉపయోగించడం మంచిది.

  చాలా కొన్ని రకాల కంపెనీలు మాత్రమే బేసిక్ ప్లాన్లలో రైడర్లను చేరుస్తున్నాయి. మిగిలిన కంపెనీలు బేసిక్ ప్లాన్లు ఏర్పాటు చేసి వారి అవసరాలకు అనుగుణంగా రైడర్లు కొనుగోలు చేసే వీలును కల్పిస్తున్నాయి. ఇందులో క్రిటికల్ ఇల్ నెస్, పర్మనెంట్ డిసేబిలిటీ, ఆక్సిడెంటల్ డెత్, ప్రీమియం వేవర్ వంటివి ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా వేరే ఇన్య్సూరెన్స్ పాలసీ లను కొనడం కంటే రైడర్లు తీసుకోవడం మంచిది. వీటి ద్వారా ట్యాక్స్ బెనెఫిట్స్ కూడా పొందే వీలుంటుంది.

  క్రిటికల్ ఇల్ నెస్ రైడర్

  ఈ రైడర్ కింద మీరు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైతే మీకు మీకు ఒకేసారి పెద్ద మొత్తం లేదా కొన్నిసార్లు కొద్ది పాళ్లలో చెల్లిస్తాయి బీమా కంపెనీలు. గుండె పోటు, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ లిస్ట్ కంపెనీలను బట్టి మారుతుంది కాబట్టి లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి వచ్చే మొత్తం ఆసుపత్రి ఖర్చులతో పాటు ఇంటి ఖర్చులు, ఈఎంఐలు కట్టేందుకు కూడా వినియోగించుకోవచ్చు. తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఆర్థికంగా కూడా ఇది సహాయపడతాయి. ఒకసారి పూర్తిగా మొత్తాన్ని చెల్లించిన తర్వాత రైడర్ క్యాన్సిల్ అవుతుంది. బేస్ పాలసీ కొనసాగుతుంది. కరోనా తర్వాత ఇలాంటి రైడర్లకు విలువ పెరిగింది.

  వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్

  ఈ రైడర్ ద్వారా ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల భవిష్యత్తులో ప్రీమియం చెల్లించలేకపోతే ఇన్స్యూరెన్స్ కంపెనీయే మిగిలిన ప్రీమియంలన్నింటినీ కడుతుంది. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీ హోల్డర్ లేదా అతడి కుటుంబ సభ్యులకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ అందుతాయి. యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్ నెస్ లేదా పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్లతో ఇది అందుబాటులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది.

  పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్

  ప్రస్తుతం ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో చెప్పలేం. అందుకే ఈ రైడర్ తీసుకోవాలి. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం ఎదురైతే దానివల్ల పనిచేసే పరిస్థితి లేకపోతే పాలసీ టర్మ్స్ ప్రకారం కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించే పద్ధతి ఎక్కువ కంపెనీలు పాటిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందిస్తుంది.

  Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

  మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

  యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్

  బేసిక్ పాలసీ ద్వారా ఇన్స్యూరెన్స్ చేసిన వ్యక్తికి కొంత మొత్తం వస్తుంది. అయితే దీనికి అదనంగా ప్రమాదంలో మరణించిన వ్యక్తికి డబ్బు రావాలంటే ఈ రైడర్ తీసుకోవచ్చు. దీనివల్ల తక్కువ మొత్తంలో పాలసీ తీసుకున్నా కుటుంబానికి ఆర్థిక రక్షణ కలుగుతుంది. ఒకవేళ మీరు ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఈ రైడర్లతో పాటు మీ ఇన్య్సూరెన్స్ కంపెనీ అందించే ఇతర రైడర్లను కూడా పరిశీలించి మీకు కావాల్సిన వాటిని బేసిక్ పాలసీకి జతగా ఎంచుకోండి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Life Insurance

  ఉత్తమ కథలు