ONE PLUS NORD 2 PAC MAN EDITION SMARTPHONES LAUNCHED IN THE INDIAN MARKET PRICE SPECIFICATIONS DETAILS PRV GH
OnePlus Nord 2: భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..
(image: OnePlus India)
భారత మార్కెట్లో ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగుతున్న వన్‌ప్లస్ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. ఇదే స్పీడ్‌తో తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్ మ్యాన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.
భారత మార్కెట్ (Indian markets)లో ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగుతున్న వన్‌ప్లస్ (One plus) వరుసగా స్మార్ట్ఫోన్ల (Smart phones)ను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. ఇదే స్పీడ్‌తో తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్ మ్యాన్ ఎడిషన్ (One plus Nord 2 pack man Edition)ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ మ్యాన్ ఎడిషన్‌ను అతిపెద్ద గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ పేర్కొంది. ఎన్నో భారీ అంచనాల తర్వాత దీన్ని ఇవాళ (నవంబర్ 16)న భారత మార్కెట్లోకి విడుదల (launch) చేసింది. రేపటి నుంచి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇక, ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్ మ్యాన్ ఎడిషన్ (One plus Nord 2 pack man Edition) రూ. 37,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ (Single variant)లో మాత్రమే లభిస్తుంది. వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ (One plus Experience Stores), వన్‌ప్లస్.ఇన్, అమెజాన్ ఇండియా స్టోర్ల (Amazon India stores) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల (Customers)కు ఉచితంగా రెడ్ కేబుల్ క్లబ్ (RCC) సభ్యత్వం లభిస్తుంది. తద్వారా 3 నెలల పాటు ఉచితంగా స్పాటిఫై ప్రీమియం (Spotify premium) సేవలు పొందవచ్చు. ఇక, లాంచ్ ఆఫర్ల (launch Offers) విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ. 2000 తగ్గింపును అందిస్తోంది. అదనంగా సిటీ బ్యాంక్ (city bank) కస్టమర్లు రూ. 1000 ఇన్స్టన్ట్ డిస్కౌంట్ పొందవచ్చు.
స్పెసిఫికేషన్ల (Specifications) పరంగా చూస్తే.. వన్‌ప్లస్ ప్యాక్‌మ్యాన్ ఎడిషన్ 6.43 -అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పవర్డ్ ఆక్సిజన్ ఓఎస్ 11.3 పై రన్ (Run) అవుతుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా (triples Rear camera) సెటప్‌ను అందించింది. దీనిలో 50- మెగాపిక్సెల్ సోనీ IMX 76 సెన్సార్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, 2-మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాలను (mega pixels Snapper camera) చేర్చింది. ఇక, దీని ముందు భాగంలో సెల్ఫీలు (selfies), వీడియో కాలింగ్ (video calling) కోసం ప్రత్యేకంగా 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీ (battery)తో వస్తుంది. ఇది 65W వార్ప్ ఛార్జ్‌కు మద్దతిస్తుంది. ఈ బ్యాటరీ ద్వారా కేవలం 30 నిమిషాలలోపు 0- నుంచి 100% వరకు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.