Ration Card: గుడ్ న్యూస్... ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు పొందొచ్చు ఇలా

Ration Card: గుడ్ న్యూస్... ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు పొందొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

One Nation One Ration Card Scheme | వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ద్వారా మీరు ఇంటి నుంచే రేషన్ కార్డు పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీరు కొత్త రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంట్లో కూర్చొని మీరు రేషన్ కార్డు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్-ONORC స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా వలస కూలీలు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవాళ్లు దేశంలోని ఏ రేషన్ షాపులో అయినా సరుకులు తీసుకోవడానికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఉపయోగపడుతుంది. 2021 మార్చి నాటికి అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమ్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రేషన్ కార్డును మీరు ఇంటి నుంచే తీసుకోవచ్చు. ఈ వివరాలను https://services.india.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రెండు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో ఒకటి బిలో పావర్టీ లైన్-BPL రేషన్ కార్డు. రెండోది నాన్ బీపీఎల్ కార్డు. బీపీఎల్ కార్డు బ్లూ లేదా ఎల్ల లేదా గ్రీన్ లేదా రెడ్ కలర్స్‌లో ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఆహార పదార్థాలు, కిరోసిన్, ఇతర వస్తువుల్ని సబ్సిడీ ధరకే పొందొచ్చు. ఎబోవ్ పావర్టీ లైన్‌లో ఉన్నవారికి తెల్ల రంగు రేషన్ కార్డులు వస్తాయి.

    Personal Loans: పర్సనల్ లోన్ కావాలా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి

    Smartphone: ఆగస్టులో రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    మీరు ఇంటి నుంచే రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే మీరు నివసిస్తున్న రాష్ట్రానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత మీ వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. వివరాలన్నీ ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత apply online బటన్ పైన క్లిక్ చేయాలి. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుకు దరఖాస్తు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డ్, హెల్త్ కార్డ్, ఆరోగ్య శ్రీ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

    Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్‌కు రోజూ రూ.10 పొదుపు చాలు... స్కీమ్‌ వివరాలివే

    Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

    2020 ఆగస్ట్ నాటికి నేషనల్ పోర్టబిలిటీ ద్వారా 23 రాష్ట్రాల్లో 67 కోట్ల లబ్ధిదారులకు అంటే 83 శాతం మందికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు చేస్తామని 2020 మేలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌లో భాగంగా 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌ ద్వారా ఒక్కొక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కుటుంబానికి కిలో పప్పు సరఫరా చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు పొడిగించింది.
    Published by:Santhosh Kumar S
    First published: