హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bharat Brand: వన్ నేషన్ - వన్ ఫర్టిలైజర్ స్కీమ్‌ ప్రారంభించిన మోదీ.. ‘భారత్’ బ్రాండ్ కింద ఎరువుల మార్కెటింగ్

Bharat Brand: వన్ నేషన్ - వన్ ఫర్టిలైజర్ స్కీమ్‌ ప్రారంభించిన మోదీ.. ‘భారత్’ బ్రాండ్ కింద ఎరువుల మార్కెటింగ్

వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్

వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తాజాగా సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా సబ్సిడీ ఎరువులన్నిటినీ కంపెనీలు ‘భారత్’ అనే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది.  

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తాజాగా సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రైతాంగానికి (Farmers) సరసమైన ధరలకు ఎరువులు లభించేలా వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ (ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన) అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సబ్సిడీ ఎరువులన్నిటినీ కంపెనీలు ‘భారత్’ అనే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ -2022 కార్యక్రమంలో భాగంగా సందర్భంగా ప్రధాని వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ పథకాన్ని ప్రారంభించారు.

వన్‌నేషన్- వన్ ఫెర్టిలైజర్ విధి విధానాలు

ఇకపై యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MoP), ఎన్‌పీకే వంటి సబ్సిడీ ఎరువులను దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్ భారత్ ద్వారా మార్కెటింగ్ చేయనున్నారు. భారత్ యూరియా, భారత్ డీఏపీ, భారత్ ఎంఓపీ, భారత్ ఎన్‌పీకే వంటి పేర్లతో సబ్సిడీ ఎరువుల బ్యాగ్‌‌లపై కామన్ డిజైన్‌ ఉండనుంది. ఒక నిర్దిష్ట కేటగిరి చెందిన ఎరువులు ఇకపై తప్పనిసరిగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (FCO) పోషక-కంటెంట్ స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉండాలి. అంటే ఒకే రకమైన ఎరువులను వేర్వేరు కంపెనీలు తయారు చేసినా అందులో పోషక విలువలు ఒకే స్థాయిలో ఉండాలి. తద్వారా ఎరువుల ఎంపికలో రైతులు గందరగోళానికి గురికాకుండా ఉంటారు. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ అనేది ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. అధిక సరుకు రవాణా సబ్సిడీలను తగ్గిస్తుంది.

శుభవార్త.. మరింత తగ్గనున్న బంగారం ధర.. కేంద్రం కీలక నిర్ణయం!

రైతులకు ప్రయోజనం

ఇప్పటి నుంచి నిర్దిష్ట వర్గానికి చెందిన ఎరువులు తప్పనిసరిగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (FCO) ప్రమాణాలు, పోషక విలువలకు అనుగుణంగా ఉండాలి. అంటే బ్రాండ్ ఏదైనా సరే, ప్రొడక్ట్స్ క్వాలిటీ మాత్రం ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు DAPని ఏ కంపెనీ ఉత్పత్తి చేసినా, దాంట్లో ఒకే రకమైన పోషక పదార్ధాలు ఉండాలి. అంటే అన్ని DAP ఎరువుల బ్రాండ్‌లు తప్పనిసరిగా 18% నత్రజని, 46% భాస్వరం కలిగి ఉండాలి. దీనివల్ల రైతులకు బ్రాండ్ల గందరగోళం ఉండదు. ఇప్పటి వరకు రైతులకు ఇలాంటి విషయాలు, వాస్తవాల గురించి తెలియదు. దీంతో బలమైన రిటైలర్ నెట్‌వర్క్‌ ఉండే కంపెనీలు, మార్కెటింగ్ వ్యూహాలతో బ్రాండ్‌లను సృష్టించి, అవే మంచివని ప్రచారం చేసేవి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్ కింద ఇలాంటి కంపెనీలకు చెక్ పడి, రైతులకు మేలు జరగనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ బంపరాఫర్.. రూ.165 పొదుపుతో రూ.8 లక్షల 50 వేలు పొందండిలా!

కిసాన్ సమృద్ధి కేంద్రాలు

తాజా కార్యక్రమంలో ప్రధాని మోదీ 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PM-KSK) సైతం ప్రారంభించారు. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల కొనుగోలు, మల్టిపుల్ సేవలు పొందే వన్-స్టాప్-షాప్ మాదిరిగా రైతులకు ఉపయోగపడనుంది. దేశంలో ఉన్న 3.3 లక్షలకు పైగా ఎరువుల రిటైల్ దుకాణాలను దశలవారీగా PM- కిసాన్ సమృద్ధి కేంద్రాలు (PM-KSK)గా మార్చాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను ఈ కేంద్రాలు సరఫరా చేయనున్నాయి. మట్టి, విత్తనాలను టెస్ట్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా అందించనున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో వ్యవసాయ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పథకాలను తీసుకొచ్చినట్లు కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

ఎరువుల ఇ-మ్యాగజైన్ లాంచ్

ఎరువులకు సంబంధించిన ఇ-మ్యాగజైన్ ‘ఇండియన్ ఎడ్జ్‌’ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఎరువులపై ఇటీవలి పరిణామాలు, ధరల ట్రెండ్స్ అనాలసిస్, లభ్యత, వినియోగం, రైతుల సక్సెస్ స్టోరీస్‌తో పాటు దేశీయ, అంతర్జాతీయంగా ఎరువుల సమాచారాన్ని ఈ మ్యాగజైన్ తెలియజేయనుంది.

First published:

Tags: Farmers, PM KISAN, PM Kisan Scheme, Pm modi

ఉత్తమ కథలు