Good News: త్వరలో 'వన్ నేషన్-వన్ డ్రైవింగ్ లైసెన్స్'

One Nation-One Driving License | దేశమంతా ఒకేతరహా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకురావడం వల్ల నేరాలు తగ్గుతాయని భావిస్తోంది కేంద్రం. అంతేకాదు... ఒకరే రెండు లైసెన్సులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఉల్లంఘనకు చెక్ పెట్టొచ్చన్నది కేంద్రం ఆలోచన.

news18-telugu
Updated: July 2, 2019, 12:06 PM IST
Good News: త్వరలో 'వన్ నేషన్-వన్ డ్రైవింగ్ లైసెన్స్'
Good News: త్వరలో 'వన్ నేషన్-వన్ డ్రైవింగ్ లైసెన్స్' (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాహనదారులకు శుభవార్త. త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇకపై దేశమంతా ఒకటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన లైసెన్స్‌లు ఒకేలా ఉండబోతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఐడీ, కలర్, భద్రతాపరమైన ఫీచర్స్ ఒకేలా ఉంచాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరుగా ఉన్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కూడా స్మార్ట్ కార్డులా మారిపోనుంది. వాటిలో మైక్రో చిప్, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ప్రస్తుతం మెట్రోకార్డ్, ఏటీఎం కార్డ్ ఎలా ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అలాగే ఉంటుంది. దేశమంతా ఒకేతరహా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకురావడం వల్ల నేరాలు తగ్గుతాయని భావిస్తోంది కేంద్రం. అంతేకాదు... ఒకరే రెండు లైసెన్సులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఉల్లంఘనకు చెక్ పెట్టొచ్చన్నది కేంద్రం ఆలోచన.

డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉండే చిప్‌లో సమస్త సమాచారం ఉంటుంది కాబట్టి... ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల వివరాలు తెలుసుకోవడం చాలా సులువు. స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నవాళ్లు మరణానంతరం తమ అవయవాలను దానం చేయడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే వాహనదారులు వెంటనే స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసే సమయంలోనే కొత్త మోడల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.15-20 మాత్రమే ఖర్చవుతుంది.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Indian Railways: ఇక రైలు టికెట్ల బుకింగ్ ఇంకా ఈజీ

Good News: ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేవు... ప్రకటించిన పేటీఎంSBI Home Loan: ఎస్‌బీఐ నుంచి రెండు రకాల హోమ్ లోన్స్... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: July 2, 2019, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading