One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే

One Nation-One Card | వన్ నేషన్ వన్ కార్డు తయారీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) కృషి చేసింది. వన్ నేషన్ వన్ కార్డునే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని కూడా పిలుస్తారు.

news18-telugu
Updated: March 14, 2019, 12:15 PM IST
One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే
One Nation One Card: వన్ నేషన్ వన్ కార్డ్ వాడితే 10% క్యాష్‌బ్యాక్... కార్డు ఫీచర్లు ఇవే (image: @NPCI_NPCI/twitter)
news18-telugu
Updated: March 14, 2019, 12:15 PM IST
One Nation One Card... ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సరికొత్త కార్డు ఇది. దేశంలోని అన్ని మెట్రోలు, సబర్బన్ రైల్వేలు, బస్సులు, షాపింగ్, డబ్బులు డ్రా చేయడానికి ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. అంటే దేశంలో ఎక్కడైనా ఉపయోగించగల ఏకైక కార్డు ఇదే. అందుకే 'వన్ నేషన్ వన్ కార్డ్' అని పేరు పెట్టారు. మీ దగ్గర ఉన్న అన్ని కార్డులకు రీప్లేస్‌మెంట్ ఈ కార్డు. ఉదాహరణకు ఏడాదికి మూడునాలుగు సార్లు ఢిల్లీ వెళ్లేవాళ్లు ఉంటారు. అక్కడ మెట్రో సేవల్ని ఉపయోగించుకోవడానికి ఢిల్లీ మెట్రో కార్డు తీసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్‌లో మెట్రో సేవల కోసం హైదరాబాద్ మెట్రో కార్డ్ తీసుకుంటారు. ముంబై వెళ్తే ముంబై మెట్రో కార్డ్ తీసుకోక తప్పదు. దీంతో రెండు కార్డులు మెయింటైన్ చేయాలి. ఇవి కాకుండా షాపింగ్ కోసం మరికొన్ని కార్డులు ఉంటాయి. ఇలా జేబునిండా కార్డులు మెయింటైన్ చేయాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారమే 'వన్ నేషన్ వన్ కార్డ్'. ఈ ఒక్క కార్డుతో మీరు ఎక్కడైనా పేమెంట్ చేయొచ్చు.


వన్ నేషన్ వన్ కార్డు ఫీచర్లు ఇవే...




వన్ నేషన్ వన్ కార్డు తయారీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) కృషి చేసింది. వన్ నేషన్ వన్ కార్డునే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని కూడా పిలుస్తారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన కార్డ్ ఇది. ఈ కార్డును దేశంలోని అన్ని మెట్రో రైళ్లు, టోల్ గేట్స్, సబర్బన్ రైల్వే, బస్సులు, పార్కింగ్ ఏరియాల్లో ఉపయోగించొచ్చు. వృత్తిరీత్యా, వ్యాపార పనుల్లో దేశమంతా తిరిగేవారికి ఈ కార్డు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ కార్డుతో షాపింగ్ మాల్స్‌లో పేమెంట్స్ చేయొచ్చు. ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఈ కార్డుకు స్వైప్-టు-పే, కాంటాక్ట్‌లెస్ ఆప్షన్లున్నాయి. ఇదే కార్డును క్రెడిట్ కార్డులా వాడుకోవచ్చు. దేశంలోని 25 ప్రభుత్వరంగ, ప్రైవేట్ బ్యాంకులు వన్ నేషన్ వన్ కార్డును జారీ చేస్తున్నాయి.
Loading...

వన్ నేషన్ వన్ కార్డుతో లాభాలు


మీ దగ్గర ఉన్న అన్ని కార్డులూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు. ఎక్కడైనా వాడుకోవచ్చు. విదేశాల్లో కూడా ఈ కార్డు పనిచేస్తుంది. ఈ కార్డు ఉపయోగించి విదేశాల్లో ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మర్చంట్ ఔట్‌లెట్స్‌లో వాడితే 10% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

TikTok Safety: టిక్ టాక్ యాప్ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చారా?

SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...