వన్ మోటో (One Moto) ఇండియా కంపెనీ(India Company) భారతదేశంలో ప్రీమియం EVలు తయారు చేస్తున్న మొట్టమొదటి బ్రిటిష్ బ్రాండ్(British Brand). డీలర్‌షిప్‌ల (Dealership) సమయంలో EVల కోసం కస్టమర్లకు(Customer) బీమా పాలసీలను(Policy) జారీ చేయడం కోసం రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్(General Insurance) కో.లిమిటెడ్ (రాయల్ సుందరం)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంస్థ ప్రొడక్ట్స్, సేవల పరంగా వేగవంతమైన వృద్ధిని కనబరుస్తోంది. EV విభాగంలో కస్టమర్లకు విలువైన సేవలు, చక్కటి అనుభూతిని అందించాలని బ్రాండ్ నిశ్చయించుకుంది. ఈ EV స్టార్టప్ ఇటీవల భారతదేశం అంతటా సులువుగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందించడానికి గ్లోబల్ కంపెనీతో ఒప్పందం చేసుకొంటున్నట్లు ప్రకటించింది.
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్‌తో వన్ మోటో ఒప్పందాన్ని.. వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించే దిశగా మరొక అడుగు అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. విక్రయ సమయంలో బీమాతో సహా అన్ని కస్టమర్ అవసరాల కోసం "వన్ స్టాప్ షాప్"గా పని చేస్తుంది.
ఈ ఒప్పందంపై వన్ మోటో ఇండియా, సేల్స్ & మార్కెటింగ్, VP, మిస్టర్ ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. ‘కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించడం మా ఆశయం. అది సాధించడానికి మేము EV ఉత్పత్తులు, ప్రపంచ స్థాయి శ్రేణికి అదనంగా సేవలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. మెజారిటీ కస్టమర్ బేస్ మొదటి సారి EVలను వినియోగిస్తున్నారు. ఆ ఆవశ్యకతను గుర్తించాము. ప్రఖ్యాత అసోసియేషన్లతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మా కస్టమర్లకు అన్ని సేవలనూ ఒకే కప్పు కింద అందించే ప్రయత్నం చేస్తున్నాం.’ అని చెప్పారు.
ప్రస్తుతం బ్రాండ్‌కు చెందిన మూడు వేర్వేరు EV ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అవి బైకా, ఎలెక్టా, కమ్యుటా. 3 నెలల స్వల్ప వ్యవధిలో మూడు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్రాండ్ తన సేవలను కూడా విస్తరించడం ప్రారంభించింది. ఒప్పందంపై రాయల్ సుందరం, రిటైల్ ఏజెన్సీ కీ పార్టనర్షిప్, కంట్రీ హెడ్ శ్రీ కెఎన్ మురళి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వ్యాప్తి చాలా వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను గొప్ప అవకాశంగా చూస్తున్నాం. వన్ మోటో బృందంతో మా అనుబంధం ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.
వన్ మోటో ఇండియా కస్టమర్లు బ్రాండ్ జారీ చేసిన మోటార్ పాలసీలకు యాడ్ ఆన్ కవర్, మినహాయింపులు అందుతాయి. ఇది కాకుండా కస్టమర్లకు వన్ మోటో సెంటర్లలో క్లెయిమ్‌ల కోసం పోటీ ధర, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ల సౌకర్యం కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇ-అమృత్ (Accelerated e-Mobility Revolution for India’s Transportation) కోసం భారత ప్రభుత్వం ఆమోదించిన మూడు కంపెనీలలో వన్ మోటో ఇండియా ఒకటి.
* వన్ మోటో గురించి
వన్ మోటో అనేది బ్రిటీష్ మొబిలిటీ కంపెనీ, ఐకానిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, బైక్‌లు, స్కూటర్ల షేప్ తీర్చిదిద్దడం, ఎలక్ట్రిఫైయింగ్ పనులు చేస్తుంది. వన్ మోటో భారతదేశంలో ప్రవేశించింది. గత నవంబర్‌లో 2 ఉత్పత్తులను ప్రారంభించింది. ఇప్పటికే 75 మంది డీలర్ల బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశంలో ఈ బ్రాండ్ ప్రధాన కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.
* రాయల్ సుందరం గురించి
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో.లిమిటెడ్, భారతదేశంలో బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ అక్టోబర్ 2000లో లైసెన్స్ పొందిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ సాధారణ బీమా కంపెనీ. కంపెనీ ప్రస్తుతం సుందరం ఫైనాన్స్ (50% ఈక్విటీ హోల్డింగ్‌తో) జాయింట్ వెంచర్‌గా ఉంది . భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCలు) ఒకటి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Vehicles, General insurance, India, Insurance, Royal