శీతాకాలం ఇంకొన్ని రోజుల్లో ముగిసి వేసవికాలం రాబోతోంది. శీతాకాలంలో ఆంధ్రా ఊటీ అరకు (Araku) అందాలు చూసే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. అరకుకు పర్యాటకుల తాకిడి అక్టోబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది. మరి సెలవుల్లో అరకు అందాలు చూడాలనుకొని మిస్ అయ్యారా? మీకు మరో ఛాన్స్ వచ్చింది. వచ్చే వారం లాంగ్ వీకెండ్ ఉంది. జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా సెలవు. జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం. ఈ రెండు రోజులు సెలవులు ఉన్నవారు జనవరి 27 లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు ఈ లాంగ్ వీకెండ్‌లో అరకు టూర్ ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకంగా అందిస్తున్న టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం 'వైజాగ్ రీట్రీట్' ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో అరకు , సింహాచలం, విశాఖపట్నం కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి స్థానికులు బుక్ చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నట్టైతే, టూర్ మొదలయ్యే సమయానికి విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంటుంది.
LIC Jeevan Azad: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... 5 లక్షల కవరేజీ, మరిన్ని బెనిఫిట్స్
ఐఆర్‌సీటీసీ టూరిజం 'వైజాగ్ రీట్రీట్' టూర్ మొదటి రోజు ఉదయం విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో రిసీవ్ చేసుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, రుషికొండ బీచ్ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత కైలాసగిరి, సబ్‌మెరైన్ మ్యూజియం, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శన ఉంటుంది. రాత్రికి వైజాగ్‌లోనే బస చేయాలి.
రెండో రోజు ఉదయం అరకు బయల్దేరాలి. దారిలో జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం చూడొచ్చు. లంచ్ తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. సాయంత్రం విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రికి విశాఖపట్నంలో బస చేయాలి. మూడో రోజు ఉదయం సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆలయ సందర్శన తర్వాత పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారికి కొత్త రేట్స్... ఎక్కువ రిటర్న్స్
ఐఆర్‌సీటీసీ టూరిజం 'వైజాగ్ రీట్రీట్' ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,985, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,835, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,380 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి పికప్, డ్రాప్, రెండు రాత్రులు విశాఖపట్నంలో రెండు రాత్రులు బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Araku, IRCTC, IRCTC Tourism, Republic Day 2023, Visakhapatnam