OMICRON TREATMENT COST WILL YOUR HEALTH INSURANCE MEDICLAIM POLICY COVER IT AND COVID19 INFECTIONS CHECK IRDAI RULES GH VB
Good News: గుడ్ న్యూస్ చెప్పిన బీమా కంపెనీలు.. ఇక ఆ చికిత్స పూర్తిగా ఉచితం అంటూ..
కొత్తగా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకునే వారు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ చికిత్సకు ఆ పాలసీ రక్షణ కల్పిస్తుందా? లేదా? అనేది చూసుకోవాలి. సమగ్ర కవరేజీ (Insurance cover) ఇచ్చే పాలసీలనే ఎంచుకోవాలి. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కొత్తగా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకునే వారు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ చికిత్సకు ఆ పాలసీ రక్షణ కల్పిస్తుందా? లేదా? అనేది చూసుకోవాలి. సమగ్ర కవరేజీ (Insurance cover) ఇచ్చే పాలసీలనే ఎంచుకోవాలి. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేసిన కరోనా (Corona virus) మహమ్మారి జీవిత బీమా (Life insurance) రంగాన్నీ సమూలంగా మార్చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీమా కంపెనీలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా కొత్తగా అనేక మార్పులు, చేర్పులు చేసి సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే కొత్తగా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకునే వారు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ చికిత్సకు ఆ పాలసీ రక్షణ కల్పిస్తుందా? లేదా? అనేది చూసుకోవాలి. సమగ్ర కవరేజీ (Insurance cover) ఇచ్చే పాలసీలనే ఎంచుకోవాలి. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..
భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలతో పాటు. వీకెండ్ సమయాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశంలో మూడో వేవ్ మొదలైంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి పాలసీల్లో కొత్తరకం ఒమిక్రాన్ వేరియంట్ చికిత్స కవర్ అవుతుందా అంటే.. అవుననే అంటున్నారు బీమా కంపెనీల ప్రతినిధులు.
ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ వల్ల ఆరోగ్య ఖర్చులను దాదాపు అన్ని బీమా కంపెనీలు భరిస్తాయంటున్నారు అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కో-ఫౌండర్, డైరెక్టర్ అతుర్ థక్కర్. అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొవిడ్-19తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్స ఖర్చులను కవర్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇటీవలే ఆదేశించిందని చెప్పారు. కోవిడ్ థర్డ్ వేవ్‌పై పోరులో భాగంగా పాలసీదారులందరికీ ఉపశమనం కలిగించేలా, ఆర్థిక భద్రత కల్పించేలా ఒమిక్రాన్ చికిత్సను ఆరోగ్య బీమాలు అందిస్తాయని చెప్పారు రెన్యూ బై సంస్థ ప్రతినిధి ఇంద్రనీల్ ఛటర్జీ.
కరోనా మొదలైనప్పటినుంచే..
పాలసీ ఒప్పందంలోని నిబంధనలు, షరతులను దృష్టిలో ఉంచుకుని నగదు రహిత సేవలతో పాటు సులువైన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కోసం.. బీమా కంపెనీలు నెట్వర్క్ ఆసుపత్రుల సమన్వయంతో పని చేస్తాయని ఐఆర్డీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2020 ఏప్రిల్‌లోనూ అన్ని సాధారణ ఆరోగ్య బీమా కంపెనీలు కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి చికిత్సకు అయ్యే ఖర్చులను భరించేలా ఆదేశించింది.
పెరుగుతున్న కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరిగిపోతోంది. మంగళవారం ఒక్కరోజే దిల్లీలో 5,481 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 531 మంది కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 41 మంది ఒమిక్రాన్ బారిన పడగా.. పద్నాలుగు మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 168 మంది స్వల్ప లక్షణాలతో(omicron variant symptoms) ఆక్సిజన్ చికిత్స పొందుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.