హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఆ స్కీంలో నెలకు పెన్షన్ రూ.10000... ఎలా చేరాలి... ఏం చెయ్యాలి...

ఆ స్కీంలో నెలకు పెన్షన్ రూ.10000... ఎలా చేరాలి... ఏం చెయ్యాలి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Pension Scheme : మనకు తెలియకుండా ఎన్నో రకాల స్కీములు... వచ్చిపోతుంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. మార్చిలో క్లోజవ్వబోతోంది. ఆ లోగా ఈ స్కీంలో చేరినవాళ్లకు నెలకు రూ.10000 పెన్షన్ వస్తుంది.

Pension Scheme or PMVVY Scheme : ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ పేరు కొంచెం పెద్దగా... చిత్రంగా ఉంటుంది. ప్రధానమంత్రి వయ వందన యోజన. ఈ స్కీం ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలా మందికి ఇదొకటి ఉందని తెలియదు. ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి... మార్చి 31తో ఈ స్కీం క్లోజవ్వబోతోంది. ఆలోగా ఇందులో చేరిన వాళ్లకు ఈ స్కీం కింద రూ.1000 నుంచీ రూ.10000 దాకా పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు LIC ద్వారా... చేరవచ్చు. 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నెల నెలా మాగ్జిమం రూ.10000 పెన్షన్‌ను ఏకంగా పదేళ్ల పాటూ పొందేలా ఈ స్కీం ఉంది. చిత్రమేంటంటే... ఇందులో చేరగానే పెన్షన్ మొదలవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే... మీరు (60 ఏళ్లు దాటిన వాళ్లు) మీ డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా వేసుకునే బదులు... ఈ స్కీంలో చేరితే... చక్కటి పెన్షన్ అమౌంట్ పొందొచ్చు.

పదేళ్ల పాలసీగా ఉండే ఈ స్కీమ్‌లో నెల నెలా పెన్షన్‌ను నెఫ్ట్ ద్వారా (NEFT) బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. నెల నెలా కాదనుకుంటే... మూడు నెలలకు ఓసారి, ఆరు నెలలకు ఓసారి, సంవత్సరానికి ఓసారి కింద కూడా పెన్షన్ పొందవచ్చు. ఐతే... ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించాలి. అంటే... మామూలు స్కీములలో లాగా... కొద్దికొద్దిగా చెల్లించడానికి వీలు లేదు. ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాలి. అతి పెద్ద మొత్తం రూ.14,45,783 ఉంది. అంత మొత్తం చెల్లించిన వారికి నెలకు రూ.10,000 పెన్షన్ వస్తుంది. ఇందులో చేరాలంటే... LIC వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి... డీటెయిల్స్ ఇచ్చి చేరవచ్చు. అది గందరగోళంగా ఉంది అనిపిస్తే... LIC ఏజెంట్‌తో మాట్లాడితే పనైపోతుంది.

పాలసీ పదేళ్లు ఉంటుంది కాబట్టి... ఈలోగా పాలసీదారు మరణిస్తే... నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు. మరో అదనపు బెనెఫిట్ ఏంటంటే... ఈ పాలసీ ద్వారా బ్యాంకు నుంచీ అప్పు పొందే ఛాన్స్ కూడా ఉంది. పాలసీ చేసిన మూడేళ్ల తర్వాత... మొత్తం డబ్బు నుంచీ 75 శాతం అప్పుగా తీసుకోవచ్చు. ఐతే... అప్పు తీసుకున్న తర్వాత నుంచీ... ఇచ్చే పెన్షన్‌లో అప్పుపై వడ్డీని మినహాయించి... మిగతా డబ్బును పెన్షన్ సొమ్ముగా ఇస్తారు. అలాగే... పదేళ్ల తర్వాత... చెల్లించే పాలసీ మొత్తం అమౌంట్ నుంచీ అప్పుగా ఇచ్చిన మొత్తాన్నీ రద్దు చేసి... మిగతా అమౌంట్, దానికి ఆ నెల వడ్డీ కలిపి ఇస్తారు. పాలసీని మధ్యలోనే రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా చేస్తే మాత్రం పాలసీ పర్చేజ్ ప్రైస్‌లో 98 శాతం సొమ్మును మాత్రమే వెనక్కి ఇస్తారు. మిగతా 2 శాతాన్ని ఇతర ఖర్చుల కింద కట్ చేస్తారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇలాంటి పెన్షన్ల స్కీములకు ఆదాయపుపన్ను మినహాయింపుల్ని రద్దు చేసింది. అందువల్ల ఈ ప్రీమియం చెల్లించిన సొమ్ముకు ఐటీ యాక్ట్‌లోని 80 C కింద మినహాయింపు లభించదు. అయినప్పటికీ దీనికి ఉన్న ప్రయోజనాల వల్ల ఎక్కువ మంది ఈ స్కీంలో చేరుతున్నారు. ఆ రూ.14,45,783 మొత్తం చెల్లించి... పదేళ్లపాటూ... నిశ్చింతగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

First published:

Tags: LIC, Pension Scheme

ఉత్తమ కథలు