news18-telugu
Updated: December 10, 2020, 7:17 AM IST
ప్రతీకాత్మకచిత్రం
చాలామందికి నాణేలు, పాత నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది. అయితే ఇలా సరదాగా సేకరించిన నాణేలు, నోట్లే మీకు లక్షలు తెచ్చిపెడతాయి అంటే నమ్ముతారా...అస్సలు నమ్మకపోవచ్చు. కానీ ఇలా సరదాగా నాణేలను, నోట్లను సేకరించినా అదృష్టం కలసివస్తే ఆ నోట్లు, నాణేలు మనకు లక్షలు సొంతమయ్యేలా చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ వెబ్ సైట్లు పాత నోట్లు, నాణేలను ఆన్ లైన్ లో పెట్టే అవకాశం కల్పిస్తున్నాయి. రోజు రోజుకు పాత నాణేలకు, నోట్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. మీ దగ్గర ఉంటే పాత నోట్లు, నాణేలు ఉంటే ఈబే లాంటి ఈ కామర్స్ సంస్థలు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. పురాతన కాలానికి చెందిన నాణేలకు, నోట్లకు రోజురోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వైష్ణవదేవి ముద్ర ఉన్న నాణేలను ఇతర దేవతామూర్తుల ముద్ర ఉన్న నాణేలను ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచి మంచి ధరకు అమ్ముడవుతున్నాయి. చాలామంది దేవతామూర్తుల నాణేలు ఇంట్లో ఉంటే కష్టాలు తొలగిపోతాయని, మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ఆ నాణేలను ఎంత మొత్తమైనా చెల్లించి కొనుగోలు చేస్తారు. అలాగే శ్రీరామ పట్టాభిషేకం ముద్ర ఉన్న దేవాలయం టోకెన్లు కూడా మంచి విలువ పలికాయి.
మరి కొందరికి పురాతన నాణేలపై ఇష్టం ఎక్కువగా ఉంటుంది. కొందరు రాజుల కాలం నాటి కాణేలు కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలాంటి నాణేలు, నోట్లు మన దగ్గర ఉంటే సులభంగా లక్షాధికారులమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి నోట్లు, నాణేలు మన దగ్గర ఉంటే ఆన్ లైన్ ద్వారా అమ్మేయడం మంచిది. కొందరు వ్యాపారులు పాత నోట్లు, కాయిన్ల కోసం మంచి ధర చెల్లిస్తారు.
నోట్ల విషయానికి వస్తే 786 సిరీస్ ఉన్న నోట్లు బాగా ప్రాముఖ్యత పొందింది. ఈ నోట్లు తమ దగ్గర ఉంటే మంచి జరుగుతుందని ఒక మతానికి చెందిన వారంతా భావిస్తారు. అలాగే న్యూమరాలజీ మీద అందువల్ల ఈ నోట్లను కొనుగోలు చేయడానికి వారు ఆసక్తి చూపుతారు. నోట్లు, నాణేలు సేకరించే అలవాటు ఉన్నవారు సేకరించిన పాత కాయిన్లు, నోట్ల ద్వారా సులువుగా డబ్బు సొంతం చేసుకోవచ్చు. అలాగే 369 నెంబర్ తో ఎండ్ అయిన నెంబర్ల నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. వీటిని కొనేందుకు ఆన్ లైన్ ద్వారా ఔత్సాహికులు ఎదురుచూస్తుంటారు.
Published by:
Krishna Adithya
First published:
December 10, 2020, 7:16 AM IST