Ola: ఓలా కారు మీరే నడపొచ్చు... త్వరలో సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్

Ola Self-Drive Service | పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్లాన్స్ రూపొందించి దేశవ్యాప్తంగా సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్ ప్రారంభించనుంది ఓలా.

news18-telugu
Updated: March 28, 2019, 6:00 PM IST
Ola: ఓలా కారు మీరే నడపొచ్చు... త్వరలో సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్
Ola: ఓలా కారు మీరే నడపొచ్చు... త్వరలో సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్
  • Share this:
క్యాబ్ సర్వీసుల్ని అందిస్తున్న ఓలా త్వరలో సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సెల్ఫ్ డ్రైవ్ సర్వీస్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో సేవల్ని మరింత విస్తరించాలనుకుంటోంది ఓలా. కొన్నేళ్లలో దేశంలోని పలు నగరాల్లో 10,000 వాహనాలను రంగంలోకి దించనుంది. వీటిలో లగ్జరీ సెడాన్స్, ఎస్‌యూవీలు కూడా ఉంటాయి. మొదట రెంటల్స్, సబ్‌స్క్రిప్షన్, కార్పొరేట్ లీజింగ్ పద్ధతిలో ప్లాన్స్ రూపొందించనుంది. ఇంకొన్ని వారాల్లోనే పైలట్ ప్రాజెక్ట్ సేవలు ప్రారంభమౌతాయి. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్లాన్స్ రూపొందించి దేశవ్యాప్తంగా సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్ ప్రారంభించనుంది ఓలా.

ఇప్పటికే సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్ అందిస్తున్న సంస్థలు అనేకం ఉన్నాయి. జూమ్‌కార్, డ్రైవ్‌జీ, ఏవిస్ ఇండియా, మైల్స్, జస్ట్ రైడ్ లాంటి సంస్థలు సెల్ఫ్ డ్రైవ్ సేవల్ని అందిస్తున్నాయి. వీటికి పోటీగా ఓలా కూడా ఇదే సర్వీస్ లాంఛ్ చేయనుంది. అయితే ఓలాకు ఉన్న విస్తృతమైన మార్కెట్ కలిసొచ్చే అంశం. కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు హైర్ చేసుకునే వెసులుబాటు సెల్ఫ్-డ్రైవ్ సర్వీస్‌లో ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా సెల్ఫ్ డ్రైవ్ కార్ బుక్ చేసుకోవచ్చు.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు

Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా
First published: March 28, 2019, 6:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading