Home /News /business /

OLA SCOOTER NEW VIDEO STUNS EVERYONE TEST RIDE WILL BE START SOON AK GH

Ola electric scooter: ఓలా ఈ స్కూటర్.. నిజంగా అదిరిపోలా.. స్పోర్ట్స్ బైక్ తరహాలో.. వీడియో వైరల్

ఓలా ఈ స్కూటర్​

ఓలా ఈ స్కూటర్​

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ర్యాంప్​పై నుంచి దూకడం, వెంటనే బ్రేకులు వేయడం, ముందు ఉన్న చక్రాన్ని గాలిలోకి ఎత్తడం వంటి అదిరిపోయే స్టంట్స్​ను మనం గమనించవచ్చు.

దేశీయ మార్కెట్​లో చాలా తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రీబుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీబుకింగ్ చేసుకున్న కస్టమర్లకు త్వరలోనే వాహన డెలివరీలు ప్రారంభంకానున్నాయి. దీంతో బుకింగ్ చేసుకున్న వారు ఈ–స్కూటర్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి ఉత్సాహాన్నిచ్చేలా ఓలా సీఈఓ భవిష్​ అగర్వాల్​ ట్విట్టర్​ వేదికగా ఓ వీడియో షేర్​ చేశారు. ఓలా ఈ–స్కూటర్​ టెస్ట్​ రైడ్​కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు.

మైక్రోబ్లాగింగ్​ సైట్​ ట్విట్టర్​లో వీడియో షేర్​ చేస్తూ ‘‘ఓలా స్కూటర్​తో సరదాగా టెస్ట్​ రైడ్​ చేశాం. ఈ టెస్ట్ రైడింగ్​లో ఈ–స్కూటర్​ ఎంతో అద్భుతమైన పనితీరు కనబర్చింది.​ అసలు టెస్ట్​ రైడ్​ వచ్చే వారం ప్రారంభంకానుంది. ఆ తర్వాత వీటి​ మొదటి డెలివరీలను ప్రారంభిస్తాం.” అని తెలిపారు. అయితే ఈ స్కూటర్​ డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.



ట్వీట్​లో టెస్ట్​ రైడ్​కు సంబంధించిన వీడియోను జోడించారు భవిష్. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అచ్చం స్పోర్ట్స్​ బైక్​లాగే స్టంట్స్​ను ప్రదర్శించింది. ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ర్యాంప్​పై నుంచి దూకడం, వెంటనే బ్రేకులు వేయడం, ముందు ఉన్న చక్రాన్ని గాలిలోకి ఎత్తడం వంటి అదిరిపోయే స్టంట్స్​ను మనం గమనించవచ్చు. వీటితో పాటు వెనుక చక్రాన్ని గాల్లోకి లేపడం, ఒకే దగ్గర ఉండి సర్కిల్​ వేయడం వంటి స్టంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అన్ని రకాలుగా పరీక్షించడం ద్వారా నెంబర్ 1 ఎలక్ట్రిక్​ స్కూటర్​గా క్లెయిమ్​ చేసుకోవాలని ఓలా భావిస్తోంది.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

ఈ నెలాఖరులోగా టెస్ట్ రైడ్ ప్రారంభం​..
ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ డెలివరీలు ఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఎస్​1, ఎస్​1 ప్రో రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లను వరుసగా రూ. 99,999, రూ. 1,29,999 వద్ద లాంచ్​ చేసింది. కంపెనీ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ల ప్రీ లాంచ్​ బుకింగ్​లను జూలైలో రూ. 499 వద్ద ప్రారంభించింది. అప్పుడు కేవలం 24 గంటల్లోనే లక్ష ఆర్డర్లను అందుకొని రికార్డు సృష్టించింది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Ola e Scooter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు