Home /News /business /

OLA S1 WHO WENT INTO REVERSE MODE WITHOUT GIVING ANY WARNING THE OWNER WHO SOLD THE SCOOTER FOR THAT BLOW GH VB

Ola S1: ‘‘ఏంటి సామీ ఇది.. స్కూటర్ ఇలా వెళ్తే ఎలా’’ అంటూ.. స్కూటర్ అమ్మేసిన యజమాని..! ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక ఓలా ఎస్1 (Ola S1) యూజర్ ఓ సమస్యను తన ట్విట్టర్ ద్వారా హైలైట్ చేశాడు. ఈ సమస్య వల్ల చివరికి అతను ఈ స్కూటర్‌ను అమ్ముకున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్‌లో ప్రాణహాని కలిగించే ఓ సాఫ్ట్‌వేర్ లోపం ఉంది.

భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు (Ola Electric Scooter) కోసం ఎంతగానో ఎదురు చూశారనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooter) డెలివరీ కావడమే ఆలస్యం.  అవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అయితే ఈ వెహికల్స్ ఇప్పుడు అత్యంత అపఖ్యాతి పాలైన స్కూటర్లగా నిలుస్తున్నాయి. రోజురోజుకీ వీటిలోని లోపాలు బయట పడుతున్నాయి. తాజాగా ఒక ఓలా ఎస్1 (Ola S1) యూజర్ ఓ సమస్యను తన ట్విట్టర్ ద్వారా హైలైట్ చేశాడు. ఈ సమస్య వల్ల చివరికి అతను ఈ స్కూటర్‌ను అమ్ముకున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్‌లో ప్రాణహాని కలిగించే ఓ సాఫ్ట్‌వేర్ లోపం ఉంది.

వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్‌లో థెమ్యాంగోఫెలో అనే ఓ యూజర్ ఓలాతో తాను ఫేస్ చేసిన సమస్యలను వరుస ట్వీట్‌లలో వివరించాడు. అక్కడ అతను వార్నింగ్ లేకుండా స్కూటర్ రివర్స్ మోడ్‌కి ఎలా వెళ్లిందో వివరించాడు. ఈ ఘటనలో తనకు గాయాలు కూడా అయ్యాయని సదరు యూజర్ చెప్పుకొచ్చాడు.



"ఒక రోజు రోడ్డు మధ్యలో ఒక కారు అడ్డంగా ఉండగా.. నేను నా స్కూటర్‌ను వెనక్కి లాగాను. అంతే అది రివర్స్ మోడ్‌ను యాక్టివేట్ చేసింది. దీనితో నేను యాక్సెల్ రేట్ (accelerate) చేశాను. అప్పుడు అది రివర్స్ డైరెక్షన్ లో దూసుకెళ్లింది. నేను కింద పడ్డాను. నా శరీరంపై గాయాలు అయ్యాయి. అలాగే నా స్కూటర్ పై గీతలు పడ్డాయి. అదృష్టవశాత్తూ అది రద్దీగా ఉండే ప్రధాన రహదారి కాదు.. కాబట్టి నేను పెద్దగా గాయాలు లేకుండా తప్పించుకున్నాను.. అది రద్దీగా ఉండే రహదారి అయితే, నేను ఇప్పటికే చనిపోయి ఉండేవాడిని" అని అతను చెప్పాడు.

ఈ సంఘటన మాత్రమే కాదు ఓలా రోడ్‌సైడ్ అసిస్టెంట్ సర్వీస్ కూడా అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్యను రెండు గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఓలా సంస్థ రెండు రోజుల వరకు స్కూటర్‌ను టచ్ కూడా చేయలేదు. చివరికి, సమస్యను పరిష్కరించడానికి ఓలా వ్యక్తులు స్కూటర్‌ను తీసుకున్నారు. ఒక వారం తర్వాత స్కూటర్ తిరిగి ఇచ్చారు కానీ దానిని తాకలేదని, రిపేర్ చేయలేదని యజమాని చెప్పారు. చాలా ఆలస్యమైన తర్వాత స్కూటర్‌ని బాగు చేసినప్పటికీ మళ్లీ ఆ స్కూటర్‌ను నడపడానికి చాలా భయపడ్డానని యూజర్ చెప్పాడు. భయంతోనే దీన్ని తన కజిన్ కి అమ్మేశానని పేర్కొన్నాడు.

వాస్తవానికి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియోలో ఓ యజమాని రివర్స్ మోడ్‌లో గరిష్ట వేగాన్ని చెక్ చేయగా అది 102 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. ఈ స్పీడ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాఫ్ట్‌వేర్ లోపం వల్ల రివర్స్ మోడ్ లో ఈ అధిక స్పీడ్ నమోదైనట్లు తెలుస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: E scootor, Electric Vehicle, Ola, Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు