Simple One e-scooter: ప్రీబుకింగ్స్​లో దుమ్మురేపిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఎన్ని బుకింగ్స్​ వచ్చాయో తెలిస్తే షాకే..

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరుకు చెందిన స్టార్టప్​ సంస్థ సింపుల్​ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఇటీవల రిలీజ్​ చేసింది. రూ. 1947తో దీని బుకింగ్స్​ను ప్రారంభించగా అనూహ్యమైన రెస్పాన్స్​ వచ్చింది.

  • Share this:
దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. ప్రముఖ ఆటో మొబైల్​ సంస్థలతో పాటు స్టార్టప్​​ సంస్థలు పోటాపోటీగా ఎలక్ట్రిక్​ స్కూటర్లను లాంచ్​ చేస్తున్నాయి. క్యాబ్​ సర్వీసెస్​ సంస్థ ఓలా తన తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఆగస్టు​ 15న​ లాంచ్​ చేయగా.. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనికి పోటీగా బెంగళూరుకు చెందిన స్టార్టప్​ సంస్థ సింపుల్​ ఎనర్జీ కూడా అదే రోజు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను రిలీజ్​ చేసింది. సింపుల్​ వన్​ పేరుతో దీన్ని రూ. 1.10 లక్షల ధర వద్ద విడుదల చేసింది. రూ. 1947తో దీని బుకింగ్స్​ను ప్రారంభించగా అనూహ్యమైన రెస్పాన్స్​ వచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ వెహికిల్ ఇప్పటికే 30,000 ప్రీబుకింగ్స్​ను అందుకుంది. కస్టమర్ల నుంచి ఈ అనూహ్య స్పందనపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంచ్ చేసిన రోజు నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. కస్టమర్లు చూపిస్తున్న ప్రేమకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా ఉత్పత్తిని నమ్మి మద్దతునిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని చెప్పారు.
Simple One EV: ఓలా ఎస్1 కి పోటీగా సింపుల్ వన్... సింగిల్ ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్ల ప్రయాణం
Honda U-BE: సింగిల్ సీట్ ఈ-స్కూటర్.. ఫీచర్లు మాత్రం సూపర్.!

సింపుల్ ఎనర్జీ స్కూటర్ బుకింగ్స్​ ప్రారంభించగానే కస్టమర్ల తాకిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారిక సైట్ క్రాష్​ అయ్యింది. దీంతో సిబ్బంది సమస్యను పరిష్కరించి మళ్లీ బుకింగ్స్​ ప్రారంభించారు. మొదటి దశలో ఈ స్కూటర్‌ను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌తో సహా 13 రాష్ట్రాల్లో విక్రయిస్తామని సింపుల్​ ఎనర్జీ తెలిపింది. ఇప్పుడు ఇతర నగరాలకు సైతం విస్తరించాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా వచ్చే రెండేళ్లలో మొత్తం రూ. 350 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్దమవుతోంది.

ఒకే ఛార్జింగ్​తో 236 కిలోమీటర్లు..
సింపుల్​ ఎనర్జీ స్కూటర్​ను ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ (ఐడిసి) మోడ్​లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తుంది. ఎకో మోడ్‌లో ఇది 203 కి.మీ. ప్రయాణాన్ని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అత్యధికంగా 105 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. దీనిలో​ 4.8kWh బ్యాటరీని అమర్చింది. ఈ స్కూటర్ నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రెజెన్ బ్లాక్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published: