Simple One EV: ఓలా ఎస్1 కి పోటీగా సింపుల్ వన్... సింగిల్ ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్ల ప్రయాణం

Simple One EV: ఓలా ఎస్1 కి పోటీగా సింపుల్ వన్... సింగిల్ ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్ల ప్రయాణం (image: Simple Energy)

Simple One EV | ఓలా ఎస్‌1 కి పోటీగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. కేవలం రూ.1947 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
భారత్‌లో చాలా ఆటోమొబైల్ కంపెనీలు విద్యుత్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు తమ విద్యుత్ ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేశాయి. తాజాగా ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ నుంచి సరికొత్త విద్యుత్ స్కూటర్ లాంచ్ అయింది. అదే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.1 లక్షలుగా (ఎక్స్ షోరూం) సంస్థ నిర్దేశించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న సింపుల్ ఎనర్జీ సంస్థ.. తమిళనాడులో హోసూరు ప్లాంట్‌లో దీన్ని తయారు చేసింది.

బుకింగ్స్ ప్రారంభం


ఇప్పటికే ఈ విద్యుత్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సింపుల్ వన్ విద్యుత్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకోవాలంటే రూ.1947 టోకెన్ అమౌంట్‌గా చెల్లించాలి. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మొత్తాన్ని బుకింగ్ ఫీజుగా కంపెనీ నిర్దేశించింది. ఈ స్కూటర్ నామ్మా రెడ్, గ్రేస్ వైట్, బ్రాజెన్ బ్లాక్, అజూర్ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతుంది.

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓపై లేటెస్ట్ అప్‌డేట్... మార్కెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా

Simple One: ఇండిపెండెన్స్ డే ఆఫర్... కేవలం రూ.1,947 ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ-బుకింగ్

మొదటి దశలో సింపుల్ వన్ విద్యుత్ స్కూటర్‌ను 13 రాష్ట్రాల్లో డెలివరీ చేయనుందీ సంస్థ. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో వినియోగదారులకు ఈ బ్యాటరీ వేకిల్‌ను అందుబాటులో ఉంచనుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తరించనుంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఛార్జింగ్, రేంజ్


సింపుల్ వన్ విద్యుత్ స్కూటర్ ఐడియల్ డ్రైవింగ్ కండిషన్లలో (IDC) సింగిల్ ఛార్జింగ్‌తో 236 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సున్నా నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.6 సెకండ్లలోనే అందుకుంటుంది.

Tax on Lottery: గిఫ్ట్ వచ్చిందా? లాటరీ గెలిచారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Unlimited Data Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఇవే

బ్యాటరీ సామర్థ్యం


ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.8 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుపరిచారు. ఈ బ్యాటరీలకు సెపరేట్‌గా ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. వీటి బరువు 6 కేజీలే ఉంటుంది. ఈ స్కూటర్ ప్రతి నిమిషం ఛార్జింగ్ తో 2.5 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంది. రాబోయే నెలల్లో 300 కొత్త పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్స్‌ను విస్తరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ సింపుల్ వన్ స్కూటర్ ఇటీవలే లాంచ్ అయిన్ ఓలా ఎస్1తో పోటీ పడనుంది. ఓలా ఎస్‌1 మాదిరిగానే ఒకే విధమైన డ్రైవింగ్ రేంజ్, యాక్సలరేషన్ టైమ్స్‌ను కలిగి ఉన్న సింపుల్ వన్ మోడల్‌ గురించి బైక్ లవర్స్ ఆరాతీస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: