Ola Offer | కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై (Electric Scooter) భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏ స్కూటర్‌పై (Scooter) ఈ ఆఫర్ ఉందని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈ భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ డీల్‌ను అందుబాటులో ఉంచింది. డిసెంబర్ టు రిమెంబర్ స్కీమ్‌లో కింద కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. ఇంకా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంటోంది. నెల వారీ ఈఎంఐ రూ. 2499 నుంచి ప్రారంభం అవుతోంది. వడ్డీ రేటు 8.99 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది.
ఇయర్ ఎండ్ ధమాకా ఆఫర్.. కారు కొంటే రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
ఇంకా క్రెడిట్ కార్డు ఈఎంఐపై 5 శఆతం డిస్కౌంట్ ఉంది. కంపెనీ యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఓలా వెహికల్ ఫైనాన్స్ స్కీమ్‌పై ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేయడం లేదు. అలాగే ఈ స్కూటర్లకు ఏడాది పాటు ఉచిత చార్జింగ్ ఫెసిలిటీ లభిస్తుంది. హైపర్ చార్జర్ నెట్‌వర్క్‌లో ఈ బెనిఫిట్ పొందొచ్చు. కాగా ఓలా కంపెనీ తన ఎస్1 ఎయిర్ మోడల్‌పై మాత్రం ఎలాంటి ఆఫర్లు అందించడం లేదు.
ఆర్బీఐ షాక్.. మీ పర్సనల్, హోమ్, కార్ లోన్ ఈఎంఐలు ఎంత పెరుగుతాయంటే?
కాగా ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. నవంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 20 వేల యూనిట్లుగా నమోదు అయ్యాయి. దీంతో అధిక మార్కెట్‌తో సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు వినూత్న ఆఫర్లు ప్రకటించింది.ఇకపోతే ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ రేటు రూ. 84,999గా ఉంది. ఓలా ఎస్1 స్కూటర్ ధర రూ. 99,999గా ఉంది. ఇక ఎలా ఎస్ 1 ప్రో స్కూటర్ రేటు రూ. 1.4 లక్షలుగా ఉంది. అంతేకాకుండా ఓలా రెఫరల్ ప్రోగ్రామ్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ. 4500 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీన్ని ఓలా మనీ రూపంలో సొంతం చేసుకోవచ్చు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ఈ రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Electric Vehicles, Ola e Scooter, Ola electric, Ola Electric Scooter