OLA S1 PRO DELIVERIES WITHIN 24 HOURS OF BOOKING ANNOUNCED COMPANY CEO HERE THE DETAILS GH VB
Ola S1 Pro: బుకింగ్ చేసిన 24 గంటల్లోనే డెలివరీలు.. ప్రకటించిన కంపెనీ సీఈఓ.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
కస్టమర్లు బుకింగ్ చేసిన 24 గంటల్లోనే S1 ప్రో స్కూటర్‌ను డెలివరీ చేస్తామని ఓలా చైర్మన్, సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం తెలిపారు. వేగవంతమైన డెలివరీ ప్రక్రియ కోసం EV స్టార్టప్ బృందం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఎలక్ట్రిక్(Electric) వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన ఓలా కంపెనీ.. తమ ఇ-స్కూటర్లతో కస్టమర్లకు సరికొత్త రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. కొత్త ఫీచర్లు(New Features), సాఫ్ట్వేర్ అప్డేట్స్తో కంపెనీ(Company) తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరికొత్తగా డిజైన్(Design) చేస్తోంది. ఈ క్రమంలో వీటి డెలివరీల వేగాన్ని కూడా పెంచాలని కంపెనీ(company) నిర్ణయించింది. కస్టమర్లు బుకింగ్ చేసిన 24 గంటల్లోనే S1 ప్రో స్కూటర్‌ను డెలివరీ చేస్తామని ఓలా చైర్మన్(Ola Chairman), సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం తెలిపారు. వేగవంతమైన డెలివరీ ప్రక్రియ కోసం EV స్టార్టప్ బృందం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. భవిష్ మాట్లాడుతూ.. ఇతర బ్రాండ్లు తమ ప్రొడక్ట్స్ రిలీజ్ చేయడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నాయని చెప్పారు. డీలర్‌షిప్‌లలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు కూడా కొన్ని రోజులు పడుతుందని, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వేగవంతమైన డెలివరీలతో ముందంజలో ఉందని చెప్పారు.
ఈ విషయంపై ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేసిన 24 గంటలలోపు డెలివరీలు జరుగుతున్నాయి! ఇది ఓలా బృందం చేసిన గొప్ప పని. చాలా ఇతర బ్రాండ్లకు ఇందుకు నెలల సమయం పడుతోంది. డీలర్‌షిప్‌లలో రిజిస్ట్రేషన్‌కు కూడా కొన్ని రోజులు పడుతుంది. భవిష్యత్తు మా కంపెనీదే, ఇందులో భాగం అవ్వండి!’ అని అగర్వాల్ ట్వీట్లో పేర్కొన్నారు.
Deliveries now happening in under 24hours from purchase!
Most other brands have months waiting. Even registrations take a few days in dealerships. The future is here, be a part of it! pic.twitter.com/4LG20pwuI9
ఓలా కంపెనీ మే 21న తాజా కొనుగోలు విండోను ఓపెన్ చేసింది. 2021లో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన తర్వాత కస్టమర్ల కోసం ఓలా ఎలక్ట్రిక్ మూడోసారి కొనుగోలు విండోను ఓపెన్ చేసింది. దీంతోపాటు దేశంలోని అనేక నగరాల్లో కమ్యూనిటీ టెస్ట్ రైడ్ క్యాంపులను కంపెనీ ఏకకాలంలో ప్రారంభించింది. ఓలా నుంచి ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ మొత్తం యాప్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. కస్టమర్లు మోడల్, రంగును కూడా ఆన్లైన్లో ఎంచుకోవచ్చు. డెలివరీ లొకేషన్‌ను జోడించవచ్చు. అలాగే యాప్ ద్వారా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫైనాన్స్ చేయవచ్చు. ఓలా ఇటీవలే స్కూటర్ కోసం MoveOS2 సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ను కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం అన్ని నగరాల్లో ఇవి రోల్ అవుట్ అవుతున్నాయి.
మరోవైపు, ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్షిప్ ఇ-స్కూటర్ ఎస్1 ప్రో ధరను రూ.10,000 పెంచింది. కొత్త ఓలా S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను గత ఏడాది ఆగస్టులో కంపెనీ లాంచ్ చేసింది. ఇండియాలో వీటి ధరలు వరుసగా రూ. 85,099, రూ. 1.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. ఇప్పుడు S1 ప్రో ధరలను కంపెనీ రూ. 10,000 పెంచింది. స్టాండర్డ్ S1 ధరలు మాత్రం మారవని సంస్థ వెల్లడించింది. ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, FAME-II, రాష్ట్ర ప్రభుత్వ రాయితీల తర్వాత). గతంలో వేరే రాష్ట్రాల్లో దీని ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. తాజా ధరల పెంపు నిర్ణయం తర్వాత ఇతర రాష్ట్రాల్లో దీని ధర రూ. 1.40 లక్షల వరకు పెరగనుంది. ఇతర రాష్ట్రాల్లో ఓలా S1 స్టాండర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 వరకు ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.