Home /News /business /

OLA S1 ELECTRIC SCOOTER EMIS DELIVERY DATES VARIANTS EXPLAINED MK GH

Ola S1 electric scooter: త్వరలో విడుదల కానున్న ఓలా ఎస్1 ఈ-స్కూటర్.. ఈఎంఐ, డెలివరీ డేట్, వేరియంట్స్ వివరాలు మీకోసం.. 

ఓలా స్కూటర్లు (Image credit : twitter)

ఓలా స్కూటర్లు (Image credit : twitter)

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఓలా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తూ సంచలనం క్రియేట్ చేస్తుందీ సంస్థ.

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఓలా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తూ సంచలనం క్రియేట్ చేస్తుందీ సంస్థ. అయితే ఈ స్కూటర్ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉండడం విశేషం. ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ. 1,29,999 గా ఉంటే ఎస్1 వేరియంట్ ధర రూ.99,999 గా ఉంది. ఆన్ రోడ్ ప్రైజెస్‌లో కొద్దిగా మార్పు ఉండవచ్చు. అయితే ధర కాస్త ఎక్కువగా ఉన్నా.. వినియోగదారులకు దగ్గర చేసేందుకు వీటిని ఈఎంఐ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓలా ప్రకటించింది. నెలకు సుమారు రూ.2,999 మాత్రమే చెల్లించి ఈ స్కూటర్‌ను పొందే వీలుంటుంది.

ఓలా స్కూటర్ల కొనుగోలుకు ఫైనాన్స్ ఇచ్చే ఫైనాన్సర్స్ వివరాలను కూడా ఈ సంస్థ వెల్లడించింది. ఈ కంపెనీలు తక్కువ వడ్డీకే రుణాలను అందించనున్నాయి. ఈ జాబితాలో HDFC, ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, ఆక్సిస్ బ్యాంక్, టాటా క్యాపిటల్, యెస్ బ్యాంక్, ఎయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి సంస్థలు ఉన్నాయి. సెప్టెంబర్ 8 నుంచి ఓలా ఈ-స్కూటర్లను కొనుగోలు చేసే వీలుంటుందని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అయితే డెలివరీ మాత్రం అక్టోబర్ లోనే ఉంటుంది.

ఓలా ఎస్1, ఎస్1 ప్రో అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్, టాప్ స్పీడ్, రకరకాల కలర్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. ఎస్1 ప్రోలో మరిన్ని అద్భుత ఫీచర్లుగా హిల్ హోల్డ్ ఫంక్షన్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. వాయిస్ అస్టిస్టెంట్ కూడా ఉంది. ఈ మూడు ఫీచర్లు బేసిక్ మోడల్ అయిన ఎస్1లో లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ గురించి చూస్తే ఓలా ఎస్1 ఒకసారి ఛార్జ్ చేస్తే 121 కిలో మీటర్ల దూరం నడుస్తుంది. ఇది ఐడిసి (ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్) ప్రకారం లెక్క మాత్రమే. అదే ఎస్1 ప్రో 181 కిలోమీటర్లు (ఐడీసీ) అందిస్తుంది. ఓలా ఎస్1 వేగం 90 కేఎంపీహెచ్ ఉంటే ఎస్1 ప్రో వేగం 115 కేఎంపీహెచ్ ఉండడం విశేషం.
Published by:Krishna Adithya
First published:

Tags: Ola Electric Scooter

తదుపరి వార్తలు