హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ola S1 Electric Scooter: ఓలానా మజాకా.. ఆ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం.. ఒక్కరోజే 10 వేల బుకింగ్స్

Ola S1 Electric Scooter: ఓలానా మజాకా.. ఆ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం.. ఒక్కరోజే 10 వేల బుకింగ్స్

Ola S1: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్... ఈఎంఐ రూ.2,999 మాత్రమే
(image: Ola Electric)

Ola S1: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్... ఈఎంఐ రూ.2,999 మాత్రమే (image: Ola Electric)

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త స్కూటర్ బుకింగ్స్‌ చూస్తుంటే ఈ కంపెనీ స్కూటర్లకు డిమాండ్ తగ్గడం కాదు.. భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఒక్క రోజులోనే తన S1 ఎలక్ట్రిక్ (Ola S1) స్కూటర్ల కోసం ఏకంగా 10 వేల బుకింగ్స్‌ అందుకుని రికార్డు సృష్టించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Ola S1 Electric Scooter:  గతేడాది ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎంత డిమాండ్ ఉందో అప్పటి బుకింగ్స్ చెప్పకనే చెప్పాయి. అయితే ఇటీవల కాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వీటికి డిమాండ్ తగ్గిందనే భావన చాలా మందిలో కలిగింది. కానీ తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త స్కూటర్ బుకింగ్స్‌ చూస్తుంటే ఈ కంపెనీ స్కూటర్లకు డిమాండ్ తగ్గడం కాదు.. భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఒక్క రోజులోనే తన S1 ఎలక్ట్రిక్ (Ola S1) స్కూటర్ల కోసం ఏకంగా 10 వేల బుకింగ్స్‌ అందుకుని రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ రేంజ్‌లో ప్రజలు ఓలా ఎస్1 స్కూటర్లను బుక్‌ చేయడం ఇదే తొలిసారి. నిజానికి గతేడాది ఆగస్టు 15న దీనిని కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ రీలాంచ్‌ చేసి రికార్డులు బ్రేక్ చేస్తోంది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ రాబోతోంది.. ధర, ఫీచర్లు, లాంచింగ్, ఇతర వివరాలు.

సెప్టెంబర్‌ 7 నుంచి డెలివరీలు ప్రారంభం

2022, ఆగస్టు నెలలో ఓలా ఎస్1 స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ధరతో కంపెనీ రీలాంచ్‌ చేసింది. ఈ స్కూటర్ బుకింగ్స్‌ సెప్టెంబర్ 1 నుంచి ఓపెన్ అవుతాయని, సెప్టెంబర్ 2న రెగ్యులర్ బుకింగ్ విండో ఓపెన్ అయి ఉంటుందని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్ 7 నాటికి స్కూటర్లను డెలివరీ చేయడం మొదలు పెడతామని వెల్లడించింది. బుకింగ్ విండో ఓపెన్ అయిన సెప్టెంబర్ 1-2 తేదీల్లో అనూహ్య రీతిలో బుకింగ్స్ జరిగాయి. ఈ సమయంలో 24 గంటల సమయంలో పదివేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే స్టాక్ అయిపోయేంత వరకు రెగ్యులర్ బుకింగ్స్ ఓపెన్ అయి ఉంటాయి. కొనుగోలుదారులు Ola S1 స్కూటర్‌ను ఓలా యాప్, ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుతో దీనిని కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.2,999 ఈఎంఐలుగా కడుతూ ఈ స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

KTM Duke Series: కొత్త లుక్ లో KTM Duke బైక్స్.. బడ్జెట్ ధరల్లో అందబాటులోకి..

Ola S1 స్కూటర్‌ ఫీచర్లు, కలర్ ఆప్షన్స్

ఈ స్కూటర్‌లో గతేడాది లాంచ్ అయిన స్కూటర్‌లోని దాదాపు అన్ని ఫీచర్లు అందించారు. ముఖ్యంగా మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి MoveOS ఫీచర్లు కంపెనీ కొత్తగా లాంచ్ అయిన Ola S1 ఆఫర్ చేసింది. ఈ స్కూటర్‌లో MoveOS 3.0 అప్‌డేట్ కూడా అందించనుంది. లిక్విడ్ సిల్వర్, పోర్సీలిన్‌ వైట్, జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, నియో మింట్ వంటి 5 కలర్ ఆప్షన్స్‌లో Ola S1 స్కూటర్ లభిస్తుంది.

* బ్యాటరీ, గరిష్ఠ వేగం, రేంజ్

3 KWh లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి రానున్న S1 కొనుగోలుదారుల అవసరాలకు తగిన వేగాన్ని అందిస్తుంది. ఓలా ప్రకారం, ఈ స్కూటర్‌ నార్మల్ మోడ్‌లో 101 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 90 కి.మీ, ఎకో మోడ్‌లో 128 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 95 కి.మీ. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ ఎండ్ వేరియంట్‌ S1 ప్రోను రూ.1,39,999గా కంపెనీ నిర్ణయించింది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bike, Business, Ola, Ola electric, Ola Electric Scooter

ఉత్తమ కథలు