Home /News /business /

OLA S1 CUSTOMERS TO GET FREE UPGRADE TO MORE EXPENSIVE S1 PRO ELECTRIC SCOOTER CEO GH VB

Ola S1: ఓలా S1 ఈ–స్కూటర్​ను​ బుక్​ చేసుకున్న కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఉచితంగానే ఆ సౌకర్యం వెసులుబాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఎలక్ట్రిక్​ టూవీలర్​ బ్రాండ్​ ఓలా ఎలక్ట్రిక్​ తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఓలా ఎస్​1ను బుకింగ్​ చేసుకున్న కస్టమర్లు ఎస్​1 ప్రో వేరియంట్​కు ఉచితంగానే అప్​గ్రేడ్​ కావొచ్చని సంస్థ సీఈవో భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేశారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ ఎలక్ట్రిక్​ టూవీలర్​ బ్రాండ్​ ఓలా ఎలక్ట్రిక్(Ola Electric)​ తన కస్టమర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఓలా ఎస్​1ను(Ola S1) బుకింగ్​ చేసుకున్న కస్టమర్లు ఎస్​1 ప్రో వేరియంట్​కు(Variant) ఉచితంగానే అప్​గ్రేడ్​(Upgrade) కావొచ్చని సంస్థ సీఈవో భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేశారు. ‘‘ఎంట్రీ-లెవల్ ఓలా S1 బుకింగ్(Booking)​ చేసుకున్న కస్టమర్లందరినీ ఎస్​1 ప్రో హార్డ్​వేర్​కు(Hardware) ఉచితంగానే అప్​గ్రేడ్​ (Upgrade) చేస్తున్నాము. కాబట్టి, ఎస్​1 కస్టమర్లు ఇప్పుడు ఎస్​1 ప్రోలోని అన్ని ఫీచర్లను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా, పర్ఫార్మెన్స్​ అప్​గ్రేడ్​లతో ప్రో రేంజ్​, హైపర్​ మోడ్​, ఇతర ఫీచర్లను సైతం అన్​లాక్​ చేయవచ్చు. వీటి డెలివరీలు ఈనెలలో లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయా కస్టమర్లకు మెయిల్​ ద్వారా తెలియజేస్తాం.”అని ట్వీట్​లో పేర్కొన్నారు.

Bike Insurance: మీ బైక్​కు బీమా చేయించాలనుకుంటున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..


అంతేకాదు, కస్టమర్లకు లోహ్రీ, సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కంపెనీ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫోటోలను కూడా షేర్​ చేశారు. అంటే, ఓలా సంస్థ త్వరలోనే తన S1 స్కూటర్లను​ పూర్తిగా నిలిపివేయనుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఓలా ఎస్​1 స్కూటర్​ను బుక్​ చేసుకున్న కస్టమర్లకు ఎస్​1 ప్రో వేరియంట్లను మాత్రమే డెలివరీ చేస్తారు. అయితే, అదనపు ఫీచర్లను పొందడానికి రూ. 30,000 అదనంగా చెల్లించాలా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఓలా ఎస్​1 స్కూటర్​ రూ. 99,999 వద్ద, ఎస్​1 ప్రో స్కూటర్​ రూ. 1,29,999 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.



జనవరి 21న చివరి చెల్లింపు విండో ఓపెన్​..
కాగా, దేశీయ మార్కెట్లోకి గతేడాది ఆగస్టు 15న ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బుకింగ్స్​లో దుమ్మురేపిన సంగతి తెలిపిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్ సాధించాయి. దీంతో, డిమాండ్​కు తగ్గ సరఫరా లేకపోవడంతో పాటు ఎలక్ట్రానిక్​ చిప్​ల కొరత కారణంగా కంపెనీ వీటి డెలివరీలను ఆలస్యంగా ప్రారంభించింది. డిసెంబర్​ నెలలో ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఓలా ఎస్​1 ప్రో స్కూటర్లను డెలివరీ చేసింది.

త్వరలోనే అన్ని ప్రధాన నగరాల్లో బుకింగ్స్​ ప్రారంభించనుంది. ఇప్పటికే రూ. 20 వేలు చెల్లించి బుకింగ్​ చేసుకున్న కస్టమర్ల కోసం జనవరి 21న సాయంత్రం 6 గంటలకు చివరి చెల్లింపు విండోను కూడా ఓపెన్​ చేయనుంది. వారు మిగతా మొత్తాన్ని చెల్లించి బుకింగ్​ కన్​ఫర్మ్​ చేసుకోవచ్చు. వారికి జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ–స్కూటర్​ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Electric bike, Ola, Two wheeler

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు