OLA S1 AND S1 PRO ELECTRIC SCOOTERS DELIVERY DELAYED YET AGAIN GH VB
Ola Electric Scooters: మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం (image: Ola Electric)
Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లకు షాకింగ్ న్యూస్. కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు మరింత ఆలస్యం కానున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లకు షాకింగ్ న్యూస్. కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు మరింత ఆలస్యం కానున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెద్ద ఎత్తున బుకింగ్స్ వచ్చినప్పటికీ.. అంత మొత్తంలో తయారీ లేకపోవడంతో డెలివరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆటో ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చిప్ కొరత వేధిస్తుండటమే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలో జాప్యానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
మార్కెట్లోకి రావడంతోనే అత్యధిక బుకింగ్స్‌తో సంచలనాలు సృష్టించిన ఓలా.. డెలివరీ విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. ఓలా తన ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఆగస్టు 15న లాంచ్ చేసింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ తర్వాతి కాలంలో నవంబర్‌కు వాయిదా వేసింది. చివరగా డిసెంబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయిని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు మొదటి విడతలో బుకింగ్ చేసుకున్న 100 మందికి మాత్రమే వాహనాలను డెలివరీ చేసింది. అవి కూడా బెంగళూరు, చెన్నై నగరాల్లోనే అందుబాటులోకి తెచ్చింది. మిగతా కస్టమర్లకు మాత్రం నిరాశే మిగిల్చింది.
ఇప్పటికే స్కూటర్లను బుకింగ్ చేసుకున్న వారు ఓలాపై రైడ్ చేయడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఓలా నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అప్పుడే డెలివరీలపై మరింత స్పష్టత రానుంది.
సెమీ కండక్టర్ల చిప్ కొరతతో మరింత ఆలస్యం..
ఓలా ఎస్1 వేరియంట్ రూ. 99,999 వద్ద, ఎస్1 ప్రో ట్రిమ్ వేరియంట్ రూ.1,29,999 వద్ద విడుదలయ్యాయి. కేవలం రూ.499లతో వీటి బుకింగ్స్ ప్రారంభించగా కస్టమర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే అత్యధిక బుకింగ్స్ సాధించి రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్‌కు తగ్గట్లుగానే సాధ్యమైనంత త్వరగా డెలివరీలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి, సెమీకండక్టర్ల కొరత ఆటంకాలు సృష్టిస్తున్నాయి.
అయితే, తమిళనాడులో ఏర్పాటు చేసిన ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో స్కూటర్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి సమయానికి డెలివరీలు అందిస్తామని ఓలా సీఈవో ఇటీవలే ప్రకటించారు. అయినప్పటికీ, డెలివరీలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో బుకింగ్ చేసుకున్న కస్టమర్లు నిరాశ చెందుతున్నారు. అయితే, ఇప్పటికే మొదటి విడత బుకింగ్స్‌ను క్లోజ్ చేసిన ఓలా.. జనవరిలో రెండో విడత బుకింగ్స్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.