Ola Electric Scooter: నేటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు... ధర ఎంతంటే

Ola Electric Scooter: నేటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు... ధర ఎంతంటే (image: Ola Electric)

Ola Electric Scooter | ఓలా ఇటీవల లాంఛ్ చేసిన ఓలా ఎస్1 (Ola S1), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​ మార్కెట్​లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు (సెప్టెంబర్​ 8) నుంచి ఓలా ఇ-స్కూటర్​ (Ola e-Scooter) అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్​ను సొంతం చేసుకోవాలనుకునే వారు ఓలా ఎలక్ట్రిక్ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి ఎస్ 1, ఎస్ 1 ప్రో వేరియంట్లను బుకింగ్​ చేసుకోవచ్చు. ఓలా ఎస్​1​ (Ola S1) ధర రూ, 99,999 వద్ద ఉండగా.. ఎస్​ 1 ప్రో (Ola S1 Pro) రూ. 1,29,99 వద్ద లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధర ఆయా రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలు, ఇతర ఆఫర్లను బట్టి మారుతుంటాయి. కాగా, ఆన్​లైన్​లోనే జరగనున్న ఈ అమ్మకాల ప్రక్రియలో‘ ఫస్ట్ కమ్​ ఫస్ట్​ సర్వ్’​ విధానాన్ని అవలంబిస్తారు. అంటే ముందుగా రూ. 499 చెల్లించి అడ్వాన్స్​ బుకింగ్​ చేసుకున్న వారికే స్కూటర్లు లభ్యం కానున్నాయి. ఆ తర్వాత స్టాక్​ మిగిలితే అప్పుడు ఇతరులకు అవకాశం ఉంటుంది.

Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర రూ.937... పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా

ఓలా జూలై నెలలోనే ఆసక్తి గల కస్టమర్ల నుంచి ప్రీబుకింగ్స్​ను ఆహ్వానించింది. ఆగష్టు 15న భారత మార్కెట్​లోకి ఈ–స్కూటర్​ను లాంచ్​ చేసింది. నిన్నటితో ఆ ప్రీబుకింగ్స్​ను ఆపేసింది. ఇప్పటి వరకు ప్రీబుకింగ్​ చేసుకున్న కస్టమర్లు ఇవాల్టి నుంచి కంపెనీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి బైక్​ను కొనుగోలు చేసుకోవచ్చు. సులభతర వాయిదాల్లోనూ ఈ–స్కూటర్​ బుకింగ్స్​ చేసుకోవచ్చు. ఈఎంఐ కల్పించేందుకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌ వంటి వివిధ ప్రముఖ బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూట్స్​తో ఓలా ఒప్పందం చేసుకుంది.

Business Idea: లక్షల్లో ఆదాయం కావాలా? ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

మొత్తం 10 కలర్​ ఆప్షన్లలో..


బుకింగ్​ చేసుకున్న వారికి అక్టోబర్​ నుంచి వాహనాల డెలివరీ ప్రారంభమవుతుంది. డీలర్​షిప్​, షోరూం వ్యవస్థ లేనందున నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు ఓలా తెలిపింది. ఓలా S1 ప్రో మోడల్ మొత్తం 10 కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బుకింగ్ సమయంలో ఇష్టపడే కలర్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం తమిళనాడులోని యూనిట్​ను ఏర్పాటు చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా ఓలా పేర్కొంది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం 2 మిలియన్ యూనిట్ల వాహనాలు తయారు కానున్నాయి. విదేశీ మార్కెట్లకు సైతం ఇక్కడ తయారు చేసిన వాహనాలను ఎగమతి చేయనున్నారు.
Published by:Santhosh Kumar S
First published: