ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు (Ola Electric Scooter) బాగా హైప్ వచ్చింది. కొద్ది రోజుల క్రితమే సేల్ ప్రకటించింది ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric). కానీ సాంకేతిక కారణాల వల్ల సేల్‌ను వాయిదా వేసింది. బుధవారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ మొదలైంది. ఓలా ఇ-స్కూటర్ (Ola e-scooter) కొనాలనుకునే కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే డబ్బులు చెల్లించి స్కూటర్‌ను రిజర్వ్ చేసిన కస్టమర్లు మిగతా మొత్తం చెల్లించి వెహికిల్ వేరియంట్, కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 (Ola S1) మోడల్ ధర రూ.99,999 కాగా, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ధర రూ.1,29,999. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు, ఫేమ్ 2 సబ్సిడీ తగ్గించిన తర్వాత ధరలు ఇవి. అయితే పలు రాష్ట్రాలు అదనంగా ఇచ్చే సబ్సిడీలు కస్టమర్లకు అదనంగా లభిస్తాయి. మీరు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
PAN Aadhaar Link: పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయలేదా? కొత్త వెబ్‌సైట్‌లో చేయండి ఇలా
Wednesday Wisdom?⁰?
Purchase is available exclusively only on the Ola App.⁰You can download it here https://t.co/gUPNf6o1eb⁰#JoinTheRevolution ?⚡ pic.twitter.com/08AERo1InJ
— Ola Electric (@OlaElectric) September 15, 2021
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓలా యాప్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో బుక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన క్లిక్ చేయండి.
ఓలా ఎస్1, ఓలా ఎస్1 మోడల్స్ కనిపిస్తాయి.
అందులో మోడల్ సెలెక్ట్ చేయండి.
ఆ తర్వాత కలర్ సెలెక్ట్ చేయండి.
Continue పైన క్లిక్ చేయండి.
స్కూటర్ ఎక్కడికి డెలివరీ చేయాలో డెలివరీ అడ్రస్ అప్‌డేట్ చేయండి.
ఇన్స్యూరెన్స్, యాడ్ ఆన్స్ సెలెక్ట్ చేయాలి.
చివరగా స్కూటర్ ధర, రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ లాంటి వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.
పేమెంట్ పూర్తి చేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేయాలి.
Insurance: ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ... ఈ టిప్స్ గుర్తుంచుకోండి
గతంలో రూ.499 టోకెన్ అమౌంట్ చెల్లించినవారికి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. పేమెంట్ సెక్షన్‌లో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కేవలం నెలకు రూ.2,999 ఈఎంఐతో ఓలా ఎస్1 సొంతం చేసుకోవచ్చు. ఓలా ఎస్1 కొనాలంటే నెలకు రూ.3,199 ఈఎంఐ చెల్లించాలి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా క్యాపిటల్ లాంటి సంస్థలు ఫైనాన్స్ ఆప్షన్స్ అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిమిషాల్లోనే ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ అందిస్తున్నాయి.
ఫైనాన్స్ ఆప్షన్ వద్దనుకుంటే బుకింగ్ సమయంలో కేవలం రూ.20,000 అడ్వాన్స్ చెల్లిస్తే చాలు. మిగతా మొత్తాన్ని షిప్‌మెంట్ సమయంలో చెల్లించాలి. ఓలా స్కూటర్ డెలివరీ 2021 అక్టోబర్‌లో మొదలవుతాయి. స్కూటర్ నేరుగా బుకింగ్ సమయంలో మీరు ఎంటర్ చేసిన అడ్రస్‌కు వస్తుంది. స్కూటర్ డెలివరీ కన్నా 72 గంటల ముందు మీకు సమాచారం అందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Electric Vehicle, New electric bike, Ola, Ola bikes, Ola e Scooter, Ola Electric Scooter