Home /News /business /

OLA REBRANDS GROCERY BUSINESS FROM OLA STORE TO OLA DASH MK

Ola Dash: ఓలా స్టోర్ ఇకపై ఓలా డాష్ గా పేరు మార్పు...10 నిమిషాల్లో ఇంటికి సరుకుల డెలివరీ...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఫ్రముఖ క్యాబ్ అగ్రిగేట్ ఓలా తన గ్రోసరీ డెలివరీ సర్వీసు అయిన ఓలా స్టోర్ ను రీబ్రాండ్ చేసింది. ఆ సంస్థ పేరును ఓలా స్టోర్ నుంచి ఓలా డాష్ గా పేరు మార్చింది. గత ఏడాది ఎక్స్ ప్రెస్ గ్రాసరీ డెలివరీ సర్వీసుగా పేరొందిన ఓలా స్టోర్ ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
  ఫ్రముఖ క్యాబ్ అగ్రిగేట్ ఓలా తన గ్రోసరీ డెలివరీ సర్వీసు అయిన ఓలా స్టోర్ ను రీబ్రాండ్ చేసింది. ఆ సంస్థ పేరును ఓలా స్టోర్ నుంచి ఓలా డాష్ గా పేరు మార్చింది. గత ఏడాది ఎక్స్ ప్రెస్ గ్రాసరీ డెలివరీ సర్వీసుగా పేరొందిన ఓలా స్టోర్ ప్రారంభించింది. ఈ బిజినెస్‌లో భాగంగా ఓలా ముంబై, బెంగళూరు అంతటా ఆన్‌లైన్‌ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. కంపెనీ రోజువారీగా సుమారు 10000 ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, ముంబైలోని కొన్ని కీలక ప్రాంతాల్లో 'ఓలా స్టోర్'ను తెరిచింది. అయితే ఈ సర్వీసు ద్వారా కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా యాప్‌ ద్వారా ఈ క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్‌ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కిరాణా డెలివరీ వ్యాపారం కోసం ఓలా 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.

  2015 జూలైలో రైడ్-హైలింగ్ సంస్థ బెంగళూరులో ఒక స్టాండ్ ఎలోన్ ఆన్‌లైన్‌ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఆ సేవలను మూసివేసింది.

  ఇదిలా ఉంటే ప్రత్యర్థి గ్రోఫర్స్ తనను తాను బ్లింకిట్‌గా రీబ్రాండ్ చేసుకున్న వారాల తర్వాత ఓలా స్టోర్ కూడ ఓలా డాష్ గా పేరు మార్చుకుంది. అలాగే కంపెనీలు స్విగ్గీ యాజమాన్యంలోని ఇన్‌స్టామార్ట్, టాటా యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్‌తో పాటు మరో ప్రత్యర్థి జెప్టోతో ఓలా డాష్ పోటీ పడుతోంది. ఓలా డాష్ అనే పేరు అమెరికన్ ర్యాపిడ్ డెలివరీ మేజర్ డోర్‌డాష్‌ను పోలి ఉంది. జోక్ర్, గెటిర్, గొరిల్లాస్ లాంటి ఇతర స్టార్టప్‌లు న్యూయార్క్ నుండి టర్కీ నుండి లండన్ వరకు నగరాల్లో 10 నిమిషాల డెలివరీని ప్రామస్ చేసి గ్రాసరీ సేవా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించాయి.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Ola, Ola Dash

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు